అమరావతి: ఒక చిన్న గ్రామంలోని కిరాణా షాపులో కూర్చుని ఉన్న మనీష్ జీవితం, ఒక్కసారిగా సినిమా కథలా మారిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాకు చెందిన 21 ఏళ్ల మనీష్ బిసి, ఇటీవల ఒక కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేశాడు. అయితే ఆ సిమ్ కార్డు గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ ఉపయోగించినది. టెలికాం కంపెనీల నిబంధనల ప్రకారం, 90 రోజులకు పైగా ఉపయోగించని నంబర్‌లను కొత్త కస్టమర్లకు కేటాయించే పద్ధతి కారణంగా, పాటిదార్ పాత నంబర్ మనీష్‌కి వచ్చింది.

కోహ్లీ, డివిలియర్స్ కాల్స్‌తో షాక్
కొత్త సిమ్ యాక్టివేట్ అయిన కొద్ది రోజులకే మనీష్‌కి ఆశ్చర్యకరమైన కాల్స్ రావడం మొదలైంది. కాల్ చేసిన వారు తమను విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, యశ్ దయాల్ అని పరిచయం చేసుకుంటూ, అతన్ని “రజత్” అని పిలిచేవారు. మొదట్లో ఇవన్నీ ప్రాంక్ కాల్స్‌గా భావించి, మనీష్ మరియు అతని స్నేహితుడు ఖేమ్‌రాజ్ వాటిని తేలిగ్గా తీసుకున్నారు. కాల్ వచ్చినప్పుడు తాము “ఎంఎస్ ధోనీ”లమని సరదాగా చెప్పేవారు.
నిజమైన రజత్ పాటిదార్ ప్రవేశం
జూలై 15 వరకు ఇది సరదాగా కొనసాగినా, ఆ రోజు నిజమైన రజత్ పాటిదార్ ఆ నంబర్‌కు కాల్ చేసి, “నేను రజత్ పాటిదార్. ఈ నంబర్ నాది, దయచేసి తిరిగి ఇవ్వండి” అని కోరాడు. ముందుగా మనీష్ దీనిని కూడా ప్రాంక్‌గా భావించి నమ్మలేదు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో, పోలీసులు మనీష్‌ను సంప్రదించి అసలు విషయం వివరించారు. అప్పటివరకు ఇది కేవలం సరదా కాల్ అనుకున్న మనీష్, తన స్నేహితుడు ఖేమ్‌రాజ్‌తో కలిసి సిమ్ కార్డును తిరిగి ఇవ్వడానికి అంగీకరించాడు.
జీవితాంతం గుర్తుంచుకునే క్షణం
ఈ సంఘటనపై మనీష్ మరియు ఖేమ్‌రాజ్ ఆనందం వ్యక్తం చేస్తూ, తప్పు నంబర్ కారణంగా తమ అభిమాన క్రికెటర్లతో మాట్లాడే అరుదైన అవకాశం లభించిందని తెలిపారు. ఖేమ్‌రాజ్ మాట్లాడుతూ, “నా జీవిత లక్ష్యం నెరవేరింది” అని చెప్పాడు. విరాట్ కోహ్లీ అభిమానులైన ఈ ఇద్దరు యువకులు ఈ అనుకోని సంఘటనను జీవితాంతం గుర్తుంచుకుంటామని తెలిపారు.
ఈ మొత్తం గందరగోళానికి కారణం టెలికాం కంపెనీల నంబర్ రీసైక్లింగ్ పద్ధతే. ఈ నిర్లక్ష్యం వల్ల ఒక సాధారణ కిరాణా షాపు, కొద్ది రోజులు క్రికెట్ హాట్‌లైన్‌గా మారిపోయింది.
ఐపీఎల్ 2025 విజేతగా రజత్ పాటిదార్
ఇక క్రికెట్ విషయానికి వస్తే, ఐపీఎల్ 2025 సీజన్‌లో రజత్ పాటిదార్ తొలిసారిగా RCB కెప్టెన్‌గా నియమితులయ్యారు. ఆయన సారథ్యంలో RCB జట్టు చారిత్రాత్మకంగా తొలి టైటిల్ అందించింది. దీంతో, కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న ప్రత్యేక ఆటగాళ్ల జాబితాలో పాటిదార్ కూడా చోటు దక్కించుకున్నారు.
🚨BIG NEWS🚨
— DIVYANSH CHAUHAN (@Imchauhan28) August 10, 2025
A guy from Chhattisgarh purchased a new sim which turned out to be Rajat Patidar's old number.
– He received calls from Virat Kohli and AB De Villiers, but after Patidar informed the Police, the man returned the sim. pic.twitter.com/Uk40U43wOL































