Rajeev Kanakala : దేవదాస్ కనకాల గారి అబ్బాయి గా ఇండస్ట్రీకి పరిచయమైన రాజీవ్ కనకాల మొదట సీరియల్స్ చేస్తూ ఆ తరువత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో హీరోగానూ విలన్ గానూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఇలా చేసిన ప్రతి పాత్రకి న్యాయం చేసారు. ఇక తన భార్య సుమ కనకాల కూడా అటు బుల్లితెర మీద బిజీ యాంకర్ గా ఉంటూ అటు సినిమాల్లోను ఇటు యూట్యూబ్ లో కూడా సొతం ఛానెల్ తో దుమ్ములేపుతోంది. ఇక రాజీవ్ కనకాల ఈ మధ్య సినిమాలను చాలా వరకు తగ్గించారు. ఎన్టీఆర్, రాజీవ్ కాంబినేషన్ బాగా హిట్ ఒకప్పుడు కానీ యామదొంగ తరువత చాలా గ్యాప్ వచ్చింది. ఇక రాజమౌళి తో కూడా ఎక్కువగా వర్క్ చేసిన రాజీవ్ ఆయన సినిమాల్లోను కనిపించక పోయేసరికి బయట బాగా రూమర్స్ వచ్చాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వాటిన్నిటి మీద రాజీవ్ క్లారిటీ ఇచ్చారు.

యాక్సిడెంట్ రోజు జరిగింది అదే…
ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుండి ట్రావెల్ అవుతున్న రాజీవ్ ఆ సినిమా నుండి మంచి మిత్రులు అయ్యారు. ఇక వాళ్లిద్దరి కాంబినేషన్ లో వరుసగా సినిమాలు వచ్చాయి. అయితే మధ్యలో గ్యాప్ రావడం గురించి రాజేవ్ మాట్లాడుతూ ఎవరి సినిమాలో వారు బిజీగా ఉండటం వల్ల అలా గ్యాప్ వచ్చింది కానీ మా మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవు అంటూ చెప్పారు.

ఇక 2009 లో ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన కారు యాక్సిడెంట్ గురించి ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎన్టీఆర్ తో పాటు కారులో రాజీవ్ కనకాల ఇంకా ఇతర స్నేహితులు ఉన్నట్లు తెలిపారు. అయితే ఎక్కువగా దెబ్బలు తారక్ కి తగిలాయని తన పక్కన ఉన్న మరో వ్యక్తికి తలకు ఒకవైపు బాగా తగిలాయని, మధ్య సీట్లో ఉన్న తనకు పెద్దగా తగలలేదని కాకపోతే మెడ దగ్గర కొంచెం తగలడం వల్ల ఫిజియో థెరపీ చేయించుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పారు.
































