Rajeev Kanakala: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో వైవిద్యమైన పాత్రలలో నటించిన రాజీవ్ కనకాల ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సుమా – రాజీవ్ కనకాల విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో రాజీవ్ కి అవకాశాలు లేకపోవడం, సుమతి రోజురోజుకీ స్టార్డం పెరిగిపోవటంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకుల తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై ఇప్పటికే సుమ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఈ వార్తలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. ఇక తాజాగా రాజీవ్ కనకాల కూడా విడాకుల వార్తలపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కి విడాకుల గురించి ప్రశ్న ఎదురైంది.ఈ క్రమంలో రాజీవ్ స్పందిస్తూ..’ మేము విడాకులు తీసుకోనున్నామనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. ఆ వార్తలలో వాస్తవం లేదని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ఈ వార్తలు అమ్మానాన్నలు ఉన్నప్పుడు వచ్చి ఉంటే వారు ఇంకా బాధపడేవారు. ఇలాంటి వార్తల గురించి సుమ పెద్దగా పట్టించుకోదు. కానీ నేను తనలా కాదు. మేమిద్దరం కలిసే ఉన్నామని చెప్పటానికి తనతో పాటు కలిసి షోస్ కి కూడా వెళ్ళాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు .

Rajeev Kanakala: అమ్మ నాన్న ఉంటే మరింత బాధపడేవారు..
అలాగే ” ఈ విడాకుల వార్తల వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. స్కూల్ లో వాళ్లకు ఎదురయ్య ప్రశ్నల వల్ల ఎంత ఇబ్బంది పడి ఉంటారు.. ఇలాంటి వార్తలు ప్రచారం చేసే వారు ప్రతీ ఒక్కరు ఆలోచించాలి. మా ఇద్దరి మధ్య గొడవలు లేవని క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా ఇలాంటి వార్తలు రావడం చాలా బాధగా ఉంది ” అంటూ రాజీవ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా సుమ ప్రస్తుతం వరుస షో లతో బిజీగా ఉంటూ ఇండస్ట్రీలోని నంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతోంది. ఇక మరొకవైపు రాజీవ్ కూడా ఇటీవల మంచి మంచి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన విరూపాక్ష సినిమాలో కూడా రాజీవ్ కీలకపాత్ర పోషించాడు.