Rajeev kanakala : తెలుగులో బుల్లితెర అటు వెండి తెర రెండింటిలోనూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు. దేవదాస్ కనకాల, లక్ష్మి గారికి పుట్టిన రాజీవ్ చిన్నప్పటి నుండి సినిమా పరిశ్రమకు దగ్గరగా పెరిగారు. తండ్రి దేవదాస్ కనకాల, తల్లి లక్ష్మి కూడా నాటక రంగం నుండి వచ్చినవారు. అలాగే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతో మందికి నటనలో శిక్షణ ఇచ్చారు. అలా రాజీవ్ కనకాల తన తల్లిదండ్రుల నుండి నటనలో శిక్షణ తీసుకున్నారు.

సుమ చాలా మొండి మనిషి…..

ఇక బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన రాజీవ్ అదే సమయంలో ప్రేమించి సుమను పెళ్లి చేసుకున్నాడు. ఇక సుమ బుల్లి తెర పై నెంబర్ వన్ యాంకర్ గా ఉండటం మనకు తెలిసిందే. ఇక ఆ మధ్య వారి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలొచ్చిన నేపథ్యంలో రాజీవ్ వాటిపై స్పందించారు. ప్రతి ఇంటిలోనూ చిన్న చిన్న తగాదాలు మాములే. మా ఇంట్లోను అంతే. అవన్నీ సహజమే పెద్ద విషయాలేం కాదు. అయితే బయటికి ఈ వార్త ఒకరి నుండి ఒకరికి వచ్చే సరికి వేరేగా మారిపోతుంది.

మా మధ్య ఎలాంటి పెద్ద గొడవలేం లేవు, నాకు కోపం వస్తే క్షణికమే మళ్ళీ మాములుగా మాట్లాడుతాను కానీ సుమ కొంచెం మొండిది, కోపం వస్తే రెండు మూడు రోజులు మాట్లాడదు. అంతే తప్ప ఇంకా పెద్ద గొడవలు మా మధ్య లేవు అంటూ తెల్చేశారు. ఇక దర్శకాధీరుడు రాజమౌళి గురించి చెబుతూ తన విజన్ చాలా గొప్పది సినిమాను తాను ప్రేమించినంతగా ఇంకెవరు ప్రేమించలేరని, ఎన్టీఆర్ ఏక సంతాగ్రహీ, తాను చాలా గొప్ప వ్యక్తి అవుతాడంటూ చెప్పుకొచ్చాడు.




























