ఎన్టీఆర్, నేను రైలు ప్రమాదంలో చనిపోయేవాళ్ళం – రాజీవ్ కనకాల

0
684

టాలీవుడ్ లో రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ఎందరో దిగ్గజ నటీనటులను తీర్చిదిద్దిన సుప్రసిద్ద దర్శకులు, నటులు, దేవదాస్ కనకాల తనయుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు రాజీవ్ కనకాల. రాజీవ్ సినిమాలలో నటించడానికి ముందు టి.వి.సీరియళ్ళలో నటించారు. ఈయన భార్య సుమ కనకాల ప్రముఖ టి.వి. యాంకర్, నటి. ఐతే మొదట్లో చిన్న చిన్న పత్రాలు చేసిన ఆయన.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి స్కోప్ ఉన్న పాత్రలు చేయడం మొదలు పెట్టారు. అలాగే ప్రతినాయకుడి పాత్రలోనూ అయన తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఒకట్రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించారు. 1991లో వచ్చిన బాయ్ ‌ఫ్రెండ్ చిత్రంద్వారా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత రాజమౌళి దర్శకతవంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “స్టూడెంట్ నెం.1” చిత్రంలో అద్భుతమైన పాత్రలో నటిచించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తరువాత వరుసగా నువ్వే నువ్వే, అది, విష్ణు, సై , అతడు, అతిధి, ఆ ఫిలిం బై అరవింద్, లక్ష్మి, విక్రమార్కుడు, యమదొంగ, నాన్నకు ప్రేమతో, మహర్షి, అప్పట్లో ఒకడుండేవాడు మొన్న లేటెస్టుగా సంక్రాతి బరిలో దిగిన ఎంత మంచివాడవురా అనే చిత్రం లో నటించాడు రాజీవ్ కనకాల.

అయితే రాజీవ్ కనకాల, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ నటించిన దాదాపు అన్ని చిత్రాలలో రాజీవ్ కనకాల ఎదో ఒక పాత్రలో నటిస్తుంటాడు. 2009 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ తరపున ప్రచారం చేసిన సమయంలో జరిగిన కారు ప్రమాదంలో ఎన్టీఆర్ తోపాటు రాజీవ్ కూడా అదే కారులో ప్రయాణించారు. ఈ మధ్య కాలంలో వీరి మధ్యలో గొడవలు ఉన్నాయని వచ్చిన రూమర్స్ పై అయన స్పందిస్తూ అలాంటివి ఏమీలేవు అని క్లారిటీ ఇచ్చారు.

అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో అయన మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అందులో ముందుగా, ఓక సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆ సినిమాలో హీరోగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ మరియు తాను ఇద్దరు చనిపోయేవాళ్ళం అని ఆసక్తి కరమైన విషయాన్నీ వెల్లడించారు. ఆ చిత్రం పేరు “నాగ”. నాగ చిత్రం షూటింగ్ సమయంలో రాజీవ్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి షూటింగ్ లో పాల్గొన్నారట, రైలు పైన యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో హఠాత్తుగా రైలు కదిలిందట. ఆ సమయంలో ఇద్దరు పడిపోయేవారట. అయితే పక్కనే ఉన్న ఎదో ఒక “ఇనుప రాడ్” ను పట్టుకుని సేఫ్ గా బయటపడ్డాం లేకుంటే అప్పుడే చనిపోయేవాళ్ళం అని చెప్పుకుంటూ వచ్చారు రాజీవ్ కనకాల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here