రాజేంద్ర ప్రసాద్… టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పాత్రలు చేయలేదు అని అనకుండా అన్ని పాత్రలు చేసిన నటుడు ఆయన. హీరో, నిర్మాత, సంగీత దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక రంగాల్లో తన ప్రతిభను చాటి చెప్పారు. అయితే ఈయన సినిమాలు ఎక్కువగా హాస్య సినిమాలు అని చెప్పవచ్చు. అయితే రాజేంద్రప్రసాద్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం….

రాజేంద్ర ప్రసాద్ గారు 1956 సంవత్సరం జూలై 19 న జన్మించారు. ఈయన స్వగ్రామం నిమ్మకూరు. ఈయన తన విద్యాభ్యాసం సిరామిక్ ఇంజినీరింగ్ లో డిప్లొమా వరకు పూర్తి చేశారు. ఆయన అప్పట్లోనే అంత చదివిన అతని మనసులో ఎప్పుడూ నటనపై ఆసక్తిని పెంచుకుంటూ వచ్చాడు. అయితే సీనియర్ ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరులోని రాజేంద్ర ప్రసాద్ కూడా జన్మించడంతో చిన్నప్పుడు నుంచి ఎన్టీఆర్ ఇంటికి తరచుగా వెళ్ళి వస్తూండేవాడు రాజేంద్ర ప్రసాద్. ఇలా చిన్నప్పటి నుంచే అతనికి సీనియర్ ఎన్టీఆర్ ప్రభావం మనసులో బలంగా పడింది. ఇక సీనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ కు ఉన్న ఆసక్తిని గమనించి ఆయన చెన్నైలోని ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించారు. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో రాజేంద్రప్రసాద్ వాళ్ళు రెండవ బ్యాచ్. ఇక ఆ బ్యాచ్ లో రాజేంద్రప్రసాద్ గోల్డ్ మెడల్ కూడా సంపాదించాడు.

ఇంత వరకు తల్లిదండ్రులు పంపించిన డబ్బులతోనే జీవితం కొనసాగించేవాడు. అయితే వారి తల్లిదండ్రులు తనని నువ్వు ఎంత చదువుకున్నావు మళ్లీ నటనలో ఇంత ప్రావీణ్యం చెందావు కానీ ఇంకా నువ్వు ఖాళీగానే ఉన్నావు అని అనడంతో వారి తల్లిదండ్రులతో మీరు నాకు డబ్బులు పంపించవద్దు నేను నా జీవితాన్నికి ఎలాగోలాగా సంపాదించుకుంటారు అని కోపంతో వారిని తిట్టి పంపించేసారట. అయితే రోజులన్నీ మనవి కాదు కదా… ఇక అప్పటి నుంచి రాజేంద్రప్రసాద్ కు తిప్పలు అంటే ఏంటో మొదలయ్యాయి. ఒకవైపు సినీ పరిశ్రమలో అవకాశాల కోసం కాళ్లు అరిగేలా చెన్నైలో పాత్రల కోసం తిరిగాడు. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. దీనితో ఒకానొక దశలో ఆయన తనువు చాలించాలి అనుకునే స్టేజ్ కి చేరుకున్నారు అంటే నమ్మండి.

ఇక అలాంటి పరిస్థితుల్లో చివరగా గట్టి ప్రయత్నం చేద్దామని తనకి తెలిసిన వారిని కలవడానికి బయలుదేరారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారికి దగ్గరగా ఉండే పుండరీకాక్షయ్య దగ్గరికి పలకరించడానికి వెళ్ళాడు. అయితే అదే సమయంలో తమిళంలో ఒక పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పుటకు మనిషిని వెతుకుతున్నారు. కానీ ఎంతమందిని ప్రయత్నించినా వారికి ఆర్టిస్ట్ దొరకలేదు. కానీ పుండరీకాక్షయ్య ఎందుకో రాజేంద్ర ప్రసాద్ ని ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి అతన్ని ఓకే చేశాడు. ఇక అంతే ఆ సన్నివేశంలో రాజేంద్ర ప్రదేశ్ బొల్లున ఏడవడం జరిగిందట. దీనితో ఏమైందని పుండరీకాక్షయ్య అడగా నేను మూడు రోజులు అయింది అన్నం తినలేదు. ముందు నాకు భోజనం పెట్టివ్వండి అని ప్రాధేయపడ్డాడు. దీనితో పుండరీకాక్షయ్య గారు రాజేంద్రప్రసాద్ కు భోజనం పెట్టించి ఆయన గురించి మొత్తం అడిగి తెలుసుకొని ఇక ముందు నీకు ఇలాంటి ఇబ్బందులు కలగవని ధైర్యం చెప్పాడు.

ఇక ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ తన సినీ ప్రస్థానాన్ని డబ్బింగ్ ఆర్టిస్టుగా మొదలుపెట్టాడు మొదట. ఇక ఆ తర్వాత నటుడిగా రాజేంద్ర ప్రసాద్ బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమాను 1977 సంవత్సరంలో నటించడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయనకు పెద్ద పాత్రలు ఏమి రాలేదు కాకపోతే వివిధ సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అదే సమయంలో తన డబ్బింగ్ ఆర్టిస్ట్ కెరియర్ ను మాత్రం వదులుకోలేదు రాజేంద్రప్రసాద్. ఇక ఆ తర్వాత అప్పట్లో ప్రముఖ దర్శకుడు వంశీ ప్రేమించు పెళ్ళాడు చిత్రంతో హీరోగా రాజేంద్ర ప్రసాద్ ని పరిచయం చేశారు. అయితే ఆ సినిమా సూపర్ సూపర్ హిట్ అయింది. దానితో రాజేంద్ర ప్రసాద్ కెరీర్ మలుపు తిరిగిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి తన హాస్యంతో తెలుగు ప్రేక్షకుల్ని ఎలా నవ్విస్తూనే తన సినిమా జీవితాన్ని గడిపారో అందరికీ తెలిసిన విషయమే. ఇక అంతే కాకుండా 2015 సంవత్సరంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా) కు అధ్యక్షుడిగా కూడా ఎన్నిక అయ్యి సినిమా రంగానికి తన సేవలందించాడు.

































