ఒక సినిమాలోని డిలీట్ చేసిన సీన్ తీసుకొని.. రజినికాంత్ ఓ బ్లాక్ బస్టర్ సినిమా రూపొందించారు.!!

0
1005

ఈ దర్శకుడిది కేరళ కాబట్టి మలయాళం నేర్చుకున్నాడు. అమ్మది తమిళనాడు కాబట్టి తమిళం నేర్చుకున్నాడు. ముంబైలో పుట్టడం వల్ల హిందీ నేర్చుకున్నాడు. తెలుగులో సినిమాలు చేయడం మూలంగా తెలుగు నేర్చుకున్నాడు. ఇలా పలు భాషలపై పట్టు ఉండటం వలన తన కెరీర్ కు చాలా వరకు ఉపయోగపడింది. బాలచందర్ హిందీ సినిమా చేస్తున్నప్పుడు. తమిళం వచ్చి హిందీ నేర్చుకున్నా ఓ యువదర్శకుడు కె. బాలచందర్ కావాలనుకున్నాడు. ఆ సమయంలో సురేష్ కృష్ణ పరిచయం కావడంతో తనకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకోవడం జరిగింది.

అలా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కో-డైరెక్టర్ గా ఎదిగి తన మొదటి సినిమా తమిళంలో కమల్ హాసన్ తో సత్య సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సురేష్ కృష్ణ సూపర్ స్టార్ రజినీకాంత్ తో అన్నామలై సినిమా తీశాడు. దానినే తెలుగులో వెంకటేష్, సుమన్ హీరోలుగా నటించిన కొండపల్లి రాజా గా వచ్చింది. తర్వాత మళ్లీ రజనీ కాంత్ రెండో సినిమాగా వీర సినిమాను రూపొందించాడు. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో ఇదివరకే అల్లరి మొగుడుగా రూపొందించబడింది.

తర్వాత తెలుగులో డైరెక్ట్ గా 1988లో వెంకటేష్, రేవతి హీరోహీరోయిన్లుగా ప్రేమ అనే చిత్రాన్ని రూపొందించాడు. తర్వాత కమలహాసన్, విజయశాంతి హీరో హీరోయిన్లుగా ఇంద్రుడు చంద్రుడు సినిమాను రూపొందించడం జరిగింది. అయితే వీరా సినిమా రూపొందిస్తున్న క్రమంలోనే భాషా సినిమా కి అస్పష్టమైన కథ ఒకటి అనుకున్నారు.

హమ్ అనే హిందీ సినిమాలో ముందుగా‌ చిత్రీకరించిన ఒక దృశ్యాన్ని కథకు అనుగుణంగా లేకపోవడంతో చిత్రం నుంచి తొలగించడం జరిగింది. హమ్ సినిమాలో గోవిందా కష్టపడి చదువుతాడు. పోలీస్ ఉద్యోగానికి వెళ్లినప్పుడు అతన్ని అధికారులు తిరస్కరిస్తారు. గది నుంచి బయటకు వచ్చి గోవిందా బాధపడుతుంటే అన్నయ్య అమితాబచ్చన్ చూసి లోపలికి వెళ్తాడు. డోర్ గ్లాస్ లోంచి అమితాబ్ పై అధికారులతో మాట్లాడడం కనిపిస్తుంది కానీ ఏమి వినపడదు. కట్ చేస్తే గోవిందా కి పోలీస్ ఉద్యోగం వస్తుంది.

సరిగ్గా ఈ సీన్ నే హమ్ చిత్రం నుంచి తొలగించారు. హమ్ సినిమాలో ఈ డిలీట్ అయిన సీన్ ని రజనీకాంత్ కి ఎంతగానో నచ్చింది. ఈ విషయాన్ని సురేష్ కృష్ణ కు చెప్పి దానిమీద ఓ కథ రాయాలని అనడంతో సురేష్ కృష్ణ రచయితల సహకారంతో భాషా సినిమా రూపొందించడం జరిగింది. ఈ సినిమా ‌1995 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here