Rakesh Master : జబర్దస్త్ పై మల్లెమాల సంస్థపై కిర్రాక్ ఆర్పి చేసిన తీవ్ర విమర్శలను ఇప్పటి వరకూ కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ ఖండించారు. కొంతమంది అవన్నీ అర్ధ సత్యాలని తెల్చేశారు. ఇక కిర్రాక్ ఆర్పి చేసిన ఆరోపణలను సమర్థిస్తున్నట్లు రాకేష్ మాస్టర్ చెప్పడం కోసమెరుపు. తిండి గురించి ఆర్పి చేసిన ఆరోపణలు నిజమని రాకేష్ మాస్టర్ అన్నాడు. ఇక జబర్దస్త్ మీద కిర్రాక్ ఆర్పి కూడా చేయనటువంటి ఆరోపణలు రాకేష్ మాస్టర్ చేసాడు.

అతను వుమనైజర్… శ్యామ్ ప్రసాద్ కి ఈ విషయంలో తెలుసో లేదో తెలియదు…
ఇక జబర్దస్త్ లో పది ఎపిసోడ్లు చేసానని, ఒకసారి ఫుడ్డు బయటి నుండి రాకపోయే సరికి అక్కడే తిన్నాను. ఏం బాగుండదు, అది కాక వడ్డించే పద్దతి కూడా బాగుండదు అంటూ చెప్పాడు. ఇక జబర్దస్త్ డైరెక్టర్ శ్రీపాద వుమనైజర్ అంటూ విమర్శించాడు. అమ్మాయిల మాటలను మాత్రమే వింటాడని మిగతా కమెడియన్స్ ను పట్టించుకోడని వారికి కనీస గౌరవం ఇవ్వడని కామెంట్స్ చేసాడు.

ఒక ఈవెంట్ చేయాలంటే ప్రాక్టీస్ కి రమ్మంటారు కానీ ప్రాక్టీస్ ఏం చేయించరు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తిరుగుతుంటారు, అక్కడ ఆర్గనైసింగ్ సరిగా లేదు. ఇక అమ్మాయిలు చెబితే మాత్రం శ్రీపాద వింటాడు వాళ్ళు చెప్పినట్లే చేస్తాడు అంటూ తీవ్ర విమర్శలు చేసారు. ఈ విషయాలన్నీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి తెలుసో లేదో తెలియదు. ఆయనకే డైరెక్ట్ గా చెబుతున్నా ఎవరికీ భయపడను అంటూ మాట్లాడారు. రాకేష్ మాస్టర్ బుల్లెట్ భాస్కర్ టీంలో పలు స్కిట్లను చేసారు.































