Rakesh master students : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లు గా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. బషీర్ అనే కంటెస్టెంట్ కి ఢీ షోలో డాన్స్ మాస్టర్ గా ఉండేవాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు.

శేఖర్ మాస్టర్ ని కొడుకులా చూసాడు…
శేఖర్, జానీ, సత్య వంటి టాప్ పొజిషన్ లో ఉన్న మాస్టర్స్ అందరూ ఒకపుడు రాకేష్ మాస్టర్ శిష్యులే. రాకేష్ మాస్టర్ 1500 పైగా సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసారు. ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఉన్న ప్రభాస్ కు ఒకప్పుడు డాన్స్ లో శిక్షణ ఇచ్చింది కూడా రాకేష్ మాస్టరే. ఆయన శిష్యులైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ డాన్స్ మాస్టర్స్ గా ఉన్నారు. వాళ్లలో శేఖర్ మాస్టర్ మీద రాకేష్ మాస్టర్ గతంలో చాలా విమర్శలను చేసేవారు.

ఇక తాజాగా రాకేష్ మాస్టర్ శిష్యులు శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ అనుబంధం గురించి మాట్లాడుతూ రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ ని కొడుకులాగా చూసేవాడని చెప్పారు. శేఖర్ మాస్టర్ కి సక్సెస్ వస్తే తన కొడుకు సక్సెస్ అయినట్లుగా ఆయన ఫీల్ అయ్యేవారు అంటూ చెప్పారు. ఆయనకు శేఖర్ మాస్టర్ కి మధ్య ఎలాంటి గొడవలు లేవు. తండ్రి కొడుకుల్లాగే ఉన్నారు వాళ్ళు, రాకేష్ మాస్టర్ కోపమొస్తే తిడతారు అంతే ప్రేమ చూపిస్తారు అంటూ చెప్పారు ఆయన శిష్యులు. మరి కడసారి రాకేష్ మాస్టర్ ను చూడటానికి బోరుబండలోని ఆయన నివాసానికి శేఖర్ మాస్టర్ వస్తాడో లేదో చూడాలి.

































