బాహుబలి లో సినిమాలో బల్లాల దేవగా అద్భుత తనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రానా దగ్గుబాటి మీద రూమర్స్ కోడైకూస్తుంటాయి. కానీ రానా మాత్రం వాటి గురించి అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పొచ్చు. కానీ రానాని మాత్రం టాలీవుడ్ ఎఫైర్స్ కింగ్ ముద్దుగా పిలుస్తుంటారు.. అయితే మరి ఇప్పుడు ఎవరితో డేటింగ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా ? అదేనండి మన ఫిట్నెస్ భామ రకుల్ ప్రీత్ సింగ్ తో రానా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఎన్ని వార్తలు వచ్చిన రానా దగ్గుబాటి ఆ రూమర్స్ పై మాత్రం అస్సలు నోరు మెదపడు. పోయేదేముందిలే అని లైట్ తీసుకుంటాడు కానీ వాటికి సంబందించి ఎటువంటి క్లారిటీ ఇవ్వడు. ఇంతకు ముందు కూడా హీరోయిన్ త్రిష తో రానా డేటింగ్ చేస్తున్నాడు అని చెన్నై మీడియా, టాలీవుడ్ మీడియా కోడై కూసింది మనోడు మాత్రం నవ్వుతూ సమాధానం చెప్తాడు తప్ప వాటిని సీరియస్ గా తీసుకోలేదు. త్రిష, రాణా చాలా సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చినా, రాణా మాత్రం నేను మారను నా మీద గాసిప్స్ రాసే వాళ్ళే మారాలి అంటున్నాడు.

ఇపుడు కూడా అదే విధంగా మరొక న్యూస్ వైరల్ అవుంతుంది అదే రకుల్, రానా డేటింగ్. అంతే కాకుండా రకుల్ తన ఇల్లు, బిజినెస్ అన్ని కూడా హైదరాబాద్ కి మార్చేసింది. నేనిప్పుడు లోకల్ అంటుంది ఈ భామ. ఇది కూడా రానాతో డేటింగ్ లో భాగమే, అందుకే మకాం మార్చింది అనేది మరో వాదన. రకుల్, రానా ఈ మధ్య ఎక్కువ ఈవెంట్స్ లలో కలిసి కనపడమే దినికి కారణం అని తెలుస్తుంది. కానీ ఈ విషయం గురించి రానా మాత్రం పెదవి విప్పడం లేదు. కానీ రకుల్ మాత్రం ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో రానా రిలేషన్ షిప్ గురించి అడిగిన ప్రశ్నకి ప్రస్తుతం నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని, నేను సింగిల్ అని సమాధానం ఇచ్చింది, అంతే కాకుండా ఇండస్ట్రీలో మంచు లక్ష్మి, రానా నాకు మంచి స్నేహితులు. ఇంకా మా బ్యాచ్ లో చాలా మంది ఉన్నారు. అంత కంటే ముఖ్యంగా రానా ది నాది పక్కపక్క ఇళ్లు కావడంతో ఆ క్లోజ్ నేస్ చూసి అలా అనుకుంటున్నారు అని క్లారిటీ ఇచ్చింది. ఇప్దుడు అర్దం అయ్యింది కదా రానా, రకుల్ మధ్య స్నేహం తప్ప ఎటువంటి రిలేషన్ లేదని.




























