సినిమా రంగంలో డ్రగ్స్ విషయం కొత్తకాదు.. ఈ విషయంపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. డ్రగ్స్ కు బానిసైన కొందరు నటీ,నటులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.! బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ డ్రగ్స్ కు బానిసయ్యే ప్రాణాలు కోల్పోయాడని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అతడి బెస్ట్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అరెస్ట్ కావడమే కాకుండా డ్రగ్స్ తీసుకుంటున్న మరో 25 మంది సినీ ప్రముఖుల పేర్లును బయట పెట్టింది. దాంతో ఆ 25 మంది సినీ ప్రముఖులకి కూడా నోటీసులు జారీ చేసేందుకు సిద్దమవుతోంది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. అయితే రియా బయట పెట్టిన పేర్లలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉందన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తిరిగి బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లింక్ బైటపడటంతో.. టాలీవుడ్‌ లోనూ ఈ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి.

బాలీవుడ్ నటి రియా చక్రవర్తి చెప్పిన పేర్లలో ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉండటంతో.. ఇక టాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా పాత్రపై మరోసారి చర్చ జరుగుతోంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ విషయమే తీసుకుంటే ఆమె బాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన సంగతి తెలిసిందే.! హైదరాబాద్‌లో ఎఫ్ 45 పేరుతో ఫిట్‌నెస్ ఫ్రాంచైజీ కూడా రన్ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. సినీ రంగానికి పరిచయమైనా కొన్ని రోజుల్లోనే మంచి పేరు సంపాదించుకున్న రకుల్ పేరు ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం సంచలనం సృష్టిస్తుంది. దీనిపై ఇంతవరకూ అటు అధికారుల నుంచి కానీ.. ఇటు రకుల్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాకపోవడం విశేషం. రకుల్ దక్షిణాదిన మంచి పేరు తెచ్చుకున్నా కూడా ముంబైలోనూ తన రిలేషన్స్ ను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటి రియా చక్రవర్తితో క్లోజ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

సుశాంత్ సూసైడ్ కేసులో రియా చక్రవర్తిని నిందితురాలిగా పేర్కొన్న సమయంలోనూ ఆమెకి అండగా రకుల్ ప్రీత్ సింగ్ చాలా సందర్భాల్లో మాట్లాడింది. సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా షేర్ చేసింది.
ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ సేవించినట్లు రియా చక్రవర్తి స్వయంగా ఒప్పుకోవడంతో పాటు.. ఇంకా ఈ డ్రగ్స్ రాకెట్లో ఎవరెవరు ఉన్నారనే అంశం నార్కోటిక్స్ వింగ్ ఎదుట పెట్టగా.. వారిలో రకుల్ ప్రీత్ పేరు బైటికి వచ్చింది.. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ కనుక ఈ కేసులో చిక్కుకుపోతే.. ఆమె నటిస్తున్న కొన్ని సినిమాలపై కూడా ఆ ప్రభావం పడే అవకాశాలు బలంగా ఉన్నాయి.

ఈ కేసుకు సంబంధించి మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏమిటంటే.. డ్రగ్స్ ఆరోపణలకు సంబంధించి పెద్ద పెద్ద రాజకీయ పార్టీల హస్తముందని, అందుకే అందరూ నిశ్శబ్దంగా ఉన్నారని, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ విషయంలో మౌనంగానే ఉండాలని ఫిక్స్ అయిపోయిందని తెలుస్తుంది. అయితే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తులో రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రముఖుల పేర్లు చెప్పడం మొదలుపెడితే చాలా మంది పెద్ద వాళ్ల పేర్లు కూడా బయటికి వస్తాయని సోషల్ మీడియా కోడై కూస్తుంది. అందుకే అవన్నీ పట్టించుకోకుండా సింపుల్‌గా సినిమా షూటింగ్‌ లలో పాల్గొంటుంది రకుల్ ప్రీత్ సింగ్. మరి ఈ డ్రగ్స్ వివాదంలో ఇంకెన్ని ట్విస్టులు చూడాల్సి వస్తుందో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here