Ram Charan : మెగా కాంపౌండ్ నుండి మెగాస్టార్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదట్లో కొంత తడబడినా ఆ తరువాత మాత్రం తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. పులి రెండడుగులు వెనక్కి వేసేది ముందుకు దుసుకుపోడానికే అన్నట్లు తన కెరీర్ లో ముందుకు వెళ్తున్నాడు చెర్రీ. ‘రంగస్థలం’ వంటి సినిమాతో హిట్ అందుకోవడమే కాకుండా నటుడుగా కూడా ఒక మెట్టు పైకి ఎదిగాడు. ఇక ఇటీవల వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో నటనలో తన కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ ఇంటర్నేషనల్ ప్లాట్ ఫామ్ మీద అవార్డులు, సత్కారాలు, ప్రశంసలు అంటూ టీం మొత్తం బిజీగా ఉన్నారు. అలా ఒక ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

నాన్న ఆ విషయంలో కోప్పడుతారు…
రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన ఫిట్ నెస్ విషయంలో ఎలా ఉంటారు అనే విషయం చెప్పారు. తినేటప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర సన్నబడ్డావేంట్రా అని ఒకసారి నాన్న అంటే నిజంగానేమో అనుకుని తల ఉపాను. వెంటనే ఆయన ఇడియట్ నువ్వు ఈ మధ్య బరువు పెరుగుతున్నావ్ శరీరాన్ని చూసుకోవా జిమ్ కి వెళ్ళు అని తిట్టారు. అక్కడే ఉన్న నా భార్య ఉపాసన ఏమిటి మీ నాన్న అలా అవమానించారు అని అడిగింది.

అది అవమానించడం కాదు ఇద్దరు నటుల మధ్య సంభాషణ అని చెప్పాను అంటూ తన తండ్రి నటుడుగా ఎంత క్రమశిక్షణతో ఉంటారో చెప్పారు చరణ్. చిన్నప్పటి నుండి నటన మీద ఆసక్తి ఉండేదని కానీ తన తండ్రి మాత్రం. మొదట చదువు ఆ తరువాత నీకు నచ్చిన పని చేయి అని చెప్పారని చరణ్ పంచుకున్నారు. అయితే తన ధ్యాస మాత్రం చదువు మీద కన్నా సినిమా మీదే ఉండేదని దీంతో కాలేజీలో చదివే సమయంలో అది గమనించిన డీన్ నాన్నకు ఫోన్ చేసి మీ అబ్బాయికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అక్కడికి పంపండి, తన సమయం నా సమయం వృధా కాదు అని చెప్పారట. అలా కాలేజ్ నుండి యాక్టింగ్ స్కూల్ కి షిఫ్ట్ అయ్యానంటూ చరణ్ తన పాత విషయాలను పంచుకున్నారు.






























