టాలీవుడ్ లో ఏంతో మంది పిల్లలు చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించారు. చైల్డ్ ఆర్టిస్టులుగా చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే చాన్స్ వచ్చిన ఆ సినిమాలో నటించినా సరే ఒక్కోసారి డ్యూరేషన్ ఎక్కువైనప్పుడు కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ లో కట్ చేస్తుంటారు. అలా సినిమాలో నటించినా ఆ సినిమాలో కనిపించని వారు ఉన్నారు.. అటువంటి కోవలోకే వస్తారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ తరువాత రాజమౌలీ దర్శకత్వంలో ‘మగధీర’ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు. ఆ మధ్య క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు చరణ్. ఇక ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టిఆర్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.. తను నటిస్తూనే మరో పక్క నిర్మాతగా మరో అవతారం ఎత్తాడు చెర్రి. తన తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్టుగా ఒక సినిమాలో నటించినట్లు తాజగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ సినిమా ఎడిటింగ్ లో చరణ్ చేసిన సీన్ తొలగించారని సమాచారం..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘లంకేశ్వరుడు’ చిత్రంలో చెర్రి చైల్డ్ ఆర్టిస్టు గా నటించినప్పటికీ ఆ సీన్స్ ఎడిటింగ్ లో పోయినట్లు తెలుస్తోంది. లంకేశ్వరుడు చిత్రం దర్శకరత్న దాసరి నారాయణరావు 100వ చిత్రం. దాసరి కూడా మూవీలో నటించినప్పటికీ సినిమాలో సీన్ లేదు. అయితే ఆ సమయంలో చెర్రిని బాలనటుడిగా సినిమాల్లో పరిచయం చేయాలని చాలా మంది డైరెక్టర్లు భావించారట. కానీ ఎందుకో కుదరకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారట. ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ చెర్రీ బాలనటుడిగా నటించకపోవడం గమనార్హం.






























