మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో RC17 ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉంది. అయితే, మెగా అభిమానులకు ఒక అదిరిపోయే న్యూస్ ఏంటంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రేజీ కాంబో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. దీంతో త్రివిక్రమ్ ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారని, ఆ కథను చరణ్ కు వినిపించి ఆయనను ఒప్పించారని సమాచారం. ఈ సినిమా కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో నిండి ఉంటుందట.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది రామ్ చరణ్.. సుకుమార్ RC17తో పాటు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కూడా సమాంతరంగా చేయనున్నారని సమాచారం. ఇదిలా ఉండగా.. త్రివిక్రమ్ ఈలోపు విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారట.
ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతోందని, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, పంచ్ లైన్స్ అదిరిపోతాయని అంటున్నారు. మరి ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.



































