Ram Gopal Varma : ఎపుడూ ఏదో ఒక కాంట్రవెర్సీ క్రియేట్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే ఆర్జీవి తన పాత సినిమా ముచ్చట్లను చెబుతూ తాజాగా యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అందులో భాగంగా ‘రంగీలా’ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఆ సినిమా తీసే సమయానికి ఫ్లాప్స్ లో ఉన్న రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా కథ మొదట శ్రీదేవి తో చేయాలనుకుని చివరికి ఊర్మిళ తో తీశారు. ఊర్మిళ కి అప్పటికే ఫ్లాప్ హీరోయిన్ అని మంచి పేరుండగా ఆ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

వీడి పని అయిపోయిందని అందరూ అన్నారు… ఊర్మిళ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది…
రంగీలా సినిమా తీయబోతున్న సమయంలో చాలా మంది రామ్ గోపాల్ వర్మ పని అయిపోయినట్లే, ఆ సినిమాతో కెరీర్ ముగిసిపోయింది అని మాట్లాడారట. ఇటీవల ఇంటర్వ్యూలో వర్మనే ఈ విషయాలను పంచుకున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది వర్మ ఇక ఇండస్ట్రీలో మనలేడు. అందుకే బాలీవుడ్ లో ఊర్మిళతో సినిమా చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేశారట. రామానాయుడు గారు కూడా ఇక వర్మ పని అయిపోయింది అని కామెంట్స్ చేశారట.

ఇక ఆ సమయంలో మీడియాలో కూడా ఊర్మిళ తో సినిమా చేసి రామ్ గోపాల్ వర్మ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడు అనే కథనాలు రావడంతో ఊర్మిళ సినిమా సగం పూర్తయ్యాక నా వల్ల వర్మ రిస్క్ తీసుకుంటున్నాడేమో అనే భావనలోకి వెళ్ళిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళింది, ఒకరోజు బాగా ఏడ్చింది అంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పారు. అయితే సినిమా విడుదల అయ్యాక అందరికీ చెంప పెట్టులాగ హిట్ అయింది. ఊర్మిళ స్టార్డమ్ మారిపోయింది అంటూ వర్మ రంగీలా సినిమా విశేషాలను పంచుకున్నరు.

































