Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ… ఆ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది వివాదాలే. తాను ఒక సినిమా చేస్తున్నాడు అంటే వివాదాలతోనే తనకు కావలసిన పబ్లిసిటీ తెచ్చుకుంటాడు. మొదట తెలుగులోనే తన కెరీర్ ను ప్రారంభించిన ఆర్జీవి తరువాత బాలీవుడ్ లో స్థిరపడిపోయాడు. ఇక ఇప్పుడు ఏ సినిమా తీసినా అది ఎపుడు వస్తోందో ఎపుడు పోతోందో ఎవరికీ తెలియదు. అయితే ఆర్జీవి మాత్రం తన సినిమాలు ఏమైనా కొత్త సినిమాలను తెస్తూనే ఉన్నాడు. ఇక ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ మీద కూడా ఫోకస్ చేసాడు వర్మ. వైసీపీ తో మంచి అనుబంధం ఉన్న వర్మ జగన్ మీద రెండు పార్టులుగా సినిమా తీస్తానంటూ జగన్ తో భేటీ అయి మరీ చెప్పాడు. ఇక ఇప్పుడు చంద్రబాబు సభల మీద తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా హాట్ కామెంట్స్ చేసి మరోసారి వైరల్ అయ్యాడు.

నరహంతకుడు చంద్రబాబు…
చంద్రబాబు నాయుడును తీవ్ర స్థాయిలో వర్మ విమర్శించాడు. కందుకూరు, గుంటూరు సభలలో జరిగిన ఆపశృతిలు నీ మైలేజీ కోసం చేసినవి అంటూ ఫైర్ అయ్యాడు. ఎంత మంది చనిపోతే అంత పాపులరిటీ వస్తుంది అనే కాన్సెప్ట్ తో సభలను ఇరుకు సందులలో పెట్టి మరీ చేసావ్ అంటూ మాట్లాడారు వర్మ. పెద్ద గ్రౌండ్ లో సభ పెడితే జనం ఎక్కువగా రారు అనే విషయం తెలుసు కాబట్టి వచ్చిన కొంత మంది జనం కనిపిస్తారని ఇరుకు సందులలో పెట్టి ఎక్కువ జనం వచ్చినట్టు పబ్లిసిటీ చేసుకున్నావ్ అంటూ విమర్శించారు. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పుకునే నువ్వు మరీ ఎలాంటి ప్రదేశాల్లో సభ పెడితే ఏం జరుగుతుంది అనే విషయం అంచనాలు వేయలేవా అందులోనూ సభకు వచ్చిన వారికి మేకలకు దాణా, కుక్కలకు బిస్కెట్ వేసినట్లు చంద్రన్న కానుకలు అని ఒక ప్రోగ్రామ్ పెట్టావు.

లేకపోతే నీ సభలకు ఎవరూ రారని నీ భయం అంటూ విమర్శించారు. అలా గుంటూరు సభలో ఆశపడి వచ్చిన జనంకు లారీ నుండి కుక్కలకు బిస్కెట్ విసిరినట్లు ఆ కానుకలను విసిరి తొక్కిసలాట అయ్యేలా చేసావ్. వారందరి మరణాలకి కారణం నువ్వే అంటూ వర్మ ఫైర్ అయ్యారు. చరిత్రలో తన రాజ్యంలోని మనుషులను చంపి వారి మీద రాజ్యం చేసిన వారిలో హిట్లర్, ముస్సోలిని లాంటి నియంతలు ఉంటారు ఆ తరువాత నేను చూసిన అలాంటి నరహంతకుడివి నువ్వే. ఈ సంఘటనతో ‘మీరు’ అని ఎపుడూ సంబోధించే నేను, చంద్రబాబుని ‘నువ్వు’ అంటున్నాను అంటూ చంద్రబాబు మీద వర్మ ఫైర్ అయ్యారు.



































