Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ… ఆ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది వివాదాలే. తాను ఒక సినిమా చేస్తున్నాడు అంటే వివాదాలతోనే తనకు కావలసిన పబ్లిసిటీ తెచ్చుకుంటాడు. మొదట తెలుగులోనే తన కెరీర్ ను ప్రారంభించిన ఆర్జీవి తరువాత బాలీవుడ్ లో స్థిరపడిపోయాడు. ఒకప్పుడు ఇండస్ట్రీకి శివ, క్షణ క్షణం, రంగీలా, భూత్, కంపెనీ, సత్య వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆర్జీవి తీసే సినిమాలు అప్పట్లో తీసిన సినిమాల లాగా వుండవు అన్న వాదన కూడా లేకపోలేదు. ఇది ఇలా ఉండగా తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో మన సినిమాల గురించి విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకులకు విజయ్ లాంటి హీరో నచ్చట్లేదు…
తాజాగా ఆర్జీవి ఒక న్యూస్ ఛానల్ నిర్వహించిన ప్రోగ్రాములో పాల్గొన్నారు. ఎందుకు విడుదలకు ముందే లైగర్ సినిమాకు వేలల్లో ట్రోల్స్ వచ్చాయి. బాయ్ కాట్ లైగర్ ఎందుకు చేశారు అని అడుగగా… ఆ సినిమా బాలీవుడ్లో డిజాస్టర్ అవ్వడానికి కారణం కంటెంట్ విషయం పక్కన పెడితే, బాయ్ కాట్ అంశం ఏమి కాదు, దీనికి పూర్తి కారణం విజయ్ దేవరకొండ ప్రవర్తన అని నా అభిప్రాయం ఒకవైపు తారక్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలు చాలా నమ్రతగా మాటడుతున్నారు… ప్రస్తుతం బాలీవుడ్ జనాలకు వారి హీరోల ప్రవర్తన చూసి మన వారిని చూసి వీళ్ళు ఎంత నమ్రతగా వున్నారు అన్న భావనతో వారిని వాళ్ల సినిమాలను చూస్తున్నారు. విజయ్ కొన్ని షోలలో కాళ్ళు టేబుల్ మీద పెట్టడం, నాకంటేనా అన్నట్టుగా ఉండటం వారికి నచ్చలేదు అందుకే అక్కడ లైగర్ డిజాస్టర్ అయ్యింది.

ఇక ఇక్కడ మనదగ్గర విషయానికి వస్తే తాను చేసిన కొన్ని స్టేట్మెంట్ల కారణంగానే ఇక్కడ కూడా జనాలు ఆసక్తి చూపించలేదు. వేలల్లో ట్రోల్స్ రిలీజ్ కు ముందే వచ్చాయి ఎందుకు అంటే మనం మాట్లాడే దాన్ని బట్టి వస్తుంటాయి. కంటెంట్ మనం ఇస్తేనే వాళ్ళు అలా రాయగలుగుతారు అని చెప్పుకొచ్చారు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో తన ప్రవర్తన, మాటల వలనే స్టార్ గా ఎదిగాడు. నాకు తెలిసి మొదటి నుండి తన ప్రవర్తన, ఆటిట్యూడ్ అదే కానీ ఇప్పుడు టైం అలా లేదు అంతే అని చెప్పుకొచ్చారు.































