Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ, ఆ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది వివాదాలే. తాను ఒక సినిమా చేస్తున్నాడు అంటే వివాదాలతోనే తనకు కావలసిన పబ్లిసిటీ తెచ్చుకుంటాడు. మొదట తెలుగులోనే తన కెరీర్ ను ప్రారంభించిన ఆర్జీవి తరువాత బాలీవుడ్ లో స్థిరపడిపోయాడు. ఒకప్పుడు ఇండస్ట్రీకి శివ, క్షణక్షణం, రంగీలా, భూత్, కంపెనీ, సత్య వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆర్జీవి తీసే సినిమాలు అప్పట్లో తీసిన సినిమాల లాగా ఉండవు అన్న వాదన కూడా లేకపోలేదు. ఇది ఇలా ఉండగా తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్షణక్షణం సినిమా గురించిన కబుర్లు చెప్పారు.

హేమ కి సెకండ్ హీరోయిన్ అని అపద్దం… కోపంతో అలా చేశారు…
క్షణ క్షణం సినిమాలో శ్రీ దేవీ హీరోయిన్ కాగా సెకండ్ హీరోయిన్ హేమ అని చెప్పి సినిమాకు ఒప్పించింది నేను కాదు, అప్పుడు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శివ నాగేశ్వర రావు అలా చెప్పి పిలుచుకు వచ్చాడు. అయితే అందులో ఒకటి నిజం సినిమాలో శ్రీదేవి తో పాటు నువ్వే ఉంటావు అని హేమకు చెప్పాడట, అదైతే నిజం అంటూ చెప్పాడు వర్మ. ఇక మరో సంఘటన గురించి మాట్లాడుతూ శ్రీదేవి పనిచేసే ఆఫీస్ లో ఆమె పై ఆఫీసర్ గా పనిచేసే వ్యక్తి పాత్ర కోసం ఒక ఆర్టిస్ట్ ను తీసుకోగా ఆయన సత్య అని హీరోయిన్ ను సీరియస్ గా పిలవాలి.

ఆ సీన్ షూటింగ్ అయ్యాక ఎందుకో నచ్చక మరో సారి బ్యాంక్ లో రీ షూట్ చేశాం. ఇది తెలియని మొదట సీన్ చేసిన ఆర్టిస్ట్ సినిమా విడుదల అయ్యాక వాళ్ళ బంధువులను ఒక 50 మందిని సినిమాకి తీసుకెళ్ళి చూడగా అందులో అతను లేకపోయే సరికి ప్రొడక్షన్ ఆఫీస్ కి కాల్ చేసి కోపంగా మాట్లాడాడు. తన బంధువుల వద్ద బాగా తిట్టాడు అంటూ వర్మ సినిమా విషయాలను పంచుకున్నారు.



























