Ram Gopal Varma: ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖులకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ల వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది. టికెట్ల రేట్లను పెంచాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంపై మాట్లాడిన విషయం తెలిసిందే.

దాని తర్వాత న్యాచురల్ స్టార్ నానీ కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. ప్రభుత్వం విమర్శల వర్షం గుప్పించాడు. ఇక తర్వాత నానీ వ్యాఖ్యలకు సపోర్టుగా మాట్లాడాడు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. టాలీవుడ్ తరుపున తన ప్రశ్నలను ప్రభుత్వానికి వినిపిస్తున్నాడు.

రెండు రోజుల నుంచి ఆర్జీవీ ప్రశ్నలకు అంతు లేదు. ఆ ప్రశ్నలు ప్రభుత్వ పెద్దల నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు. కౌంటర్ కు ప్రతి కౌంటర్ ఇస్తూ రెచ్చిపోతున్నాడు. ఇక తాజాగా వర్మ ట్వీట్లకు ఏపీ మంత్రి పేర్ని నాని సమాధానాలు చెప్పడంతో.. ట్వీట్ కు ప్రతి ట్వీట్లతో ఓ యుద్ధ వాతావరణమే తయారైంది.
కోడాలి నాని ఎలా స్పందిస్తారో..
ఇకపోతే తాజాగా వర్మ వేసిన ట్వీట్ మరో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో కోడాలి నాని ప్రస్తావన తీసుకొచ్చాడు. ‘‘AP టికెట్ రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ @NameisNani ఒక్కడే ..వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు’’ అంటూ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం వర్మ ట్వీట్ పెద్ద వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై కోడాలి నాని ఇంతవరకు స్పందించలేదు. అతడి వద్ద నుంచి ఏ సమాధానం వస్తుందో చూద్దాం.
A P టికెట్ రేట్ల విషయం లో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ @NameisNani ఒక్కడే ..వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు.
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022






























