Ram Gopal Varma: టాలివుడ్ లో ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆర్జీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఆర్జీవీ ఇప్పుడు సరైన అవకాశాలు అందుకోలేకపోతున్నాడు . అయితే ప్రస్తుతం ఆర్జీవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినీ ప్రముఖుల మీద రాజకీయ ప్రముఖుల మీద తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అందువల్ల రాంగోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాస్పద దర్శకుడుగా ఇండస్ట్రీలో గుర్తింపు.

ఇలా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ టిడిపి నాయకులు టిడిపి అధినేత చంద్రబాబు గురించి కూడా అప్పుడప్పుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. తాజాగా మరొకసారి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గురించి కూడా రాంగోపాల్ వర్మ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో యువగలం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Ram Gopal Varma: నారా లోకేష్ కి ఆస్కార్ రావాలి…
తాజాగా పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ నేల తల్లికి నమస్కరిస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనను మనస్ఫూర్తిగా ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే నారా లోకేష్ షేర్ చేసిన ఈ పోస్ట్ కి రాంగోపాల్ వర్మ స్పందిస్తూ మరొక పోస్ట్ షేర్ చేశాడు. ఈ క్రమంలో ఆర్జీవీ స్పందిస్తూ..” ఆస్కార్ అవార్డు దక్కాల్సింది రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకి కాదు … అవార్డు ఖచ్చితంగా నారా లోకేష్ కి దక్కాలి అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం నారా లోకేష్ ని ఉద్దేశిస్తూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆర్జీవి చేసిన ఈ ట్వీట్ కి పలువురు టిడిపి నేతలు కార్యకర్తలు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
And the OSCAR goes to not #RRR , not to @ssrajamouli , not to @mmkeeravaani not to @AlwaysRamCharan , not to @tarak9999 ..IT GOES TO @naralokesh ???????????????????????????? pic.twitter.com/dctyNTEAdq
— Ram Gopal Varma (@RGVzoomin) June 14, 2023































