తెలుగులో హాస్య నటులకు పెద్దగా కొదవలేదు కానీ బ్రహ్మానందం, అలీ వంటి సీనియర్ కమెడియన్స్ ని దాటుకుని అవకాశాలను సంపాదించాలి అంటే ఖచ్చితంగా వారికంటే విభిన్న శైలిలో వినోదాన్ని పండించాలి. అలాంటి వినోదాన్ని పండించండంలో మొదట ఉండే నటుడు వెన్నెల కిషోర్. ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా సినిమాలలో హీరో పక్కనే ఉండి హాస్యాన్ని పండిస్తున్నారు వెన్నెల కిషోర్. అంతేకాదు ప్రస్తుతం టాలీవుడ్ లో వెన్నెల కిషోర్ లేని సినిమా లేదు అంటే అతిశయోక్తి కాదేమో. టాలీవుడ్ లో ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతోను, షూటింగ్ స్పాట్ లో జరిగే హాస్య సన్నివేశాలతోను అభిమానులకు చాలా దగ్గరగా ఉంటాడు. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ తో అయన ట్విట్టర్ ని తనకు బాగా అలవాటైన హాస్య రసాన్ని జోడించి అభిమానులకు ఎక్స్ట్రా వినోదాన్ని అందిస్తుంటారు. ఆ వీడియోలు వైరల్ అవుతుంటాయి కూడా. తాజాగా వెన్నెల కిషోర్ నటించిన జాను, భీష్మ చిత్రాలు అతి త్వరలో విడుదల కాబోతున్నాయి. అయితే ఈ సినిమాలలో వెన్నెల కిషోర్ ఎంతగా ఎంటర్టైన్ చేస్తాడని అయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే తాజాగా వెన్నెల కిషోర్ ఒక వీడియోతో తన ట్విట్టర్ ని మ్రోత మోగిస్తున్నారు. అదేనండి తాగుబోతు రమేష్ తో కలిసి షూటింగ్ సమయంలో వీరు చేసిన ఫన్నీ ఇన్సిడెంట్ ను వీడియో తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసారు వెన్నెల కిషోర్. చెరువులోకి వెళుతున్న తాగుబోతు రమేష్ ని “నువ్వు బ్యాంకాక్ మిస్ అవుతున్నావా?” అని అడిగారు. ఆ ప్రశ్నకి సమాధానంగా తాగుబోతు రమేష్ “అవును మిస్ అవుతున్నాను” అంటూ సమాధానం ఇచ్చారు. వెనువెంటనే “ఎందుకు మిస్ అవుతున్నావ్” అంటూ మరో ప్రశ్న వేశారు వెన్నెల కిషోర్. “బ్యాంకాక్ లో మసాజ్ సెంటర్లలో మసాజ్ చేయించుకోవడం, కళ్ళు చేపల తొట్టెలో పెట్టగానే ఆ చేపలు అన్ని కాళ్ళ చుట్టూ ఉన్న మృత చర్మాన్ని కొరుక్కుతింటాయి.. అది ఒక సూపర్ ఎక్స్పీరియన్స్” అంటూ మరో సమాధానం ఇచ్చాడు తాగుబోతు రమేష్. అయితే ఈ చెరువులో కూడా అలాంటి అనుభవం దొరుకుతుందో లేదో చూద్దాం అంటూ తాగుబోతు రమేష్ చెరువులో తన కాళ్ళు పెట్టగా ఆ చేపలు వచ్చి కాళ్ళ చుట్టూ చేరి కొరకడం మొదలు పెట్టాయి.

అదంతా వీడియో తీసి ట్విట్టర్ లో తన అభిమానులకు షేర్ చేసాడు వెన్నెల కిషోర్. అయితే ఇప్పటి తరానికి బ్యూటీ స్పాలలో, షాపింగ్ మాల్స్ లో ఫిష్ పెడిక్యూర్ పేరుతో మాత్రమే తెలుసుగాని, చిన్నప్పుడు చెరువు గట్టున కూర్చుని కాళ్ళు చెరువులో పెట్టిన సంగతి నాటి తరానికి మాత్రం అనుభవమే… మరల వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ ల పుణ్యమా అని ఇప్పడు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here