Ramesh Reddy : సినిమాల్లో నటుడుగా, రైటర్ గా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రమేష్ రెడ్డి గారు. ఎక్కువగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి సినిమాలకు పనిచేసిన రమేష్ రెడ్డి గారు హరీష్ శంకర్ కు బాగా సన్నిహితుడు. హరీష్ శంకర్ అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నపటినుండి ఇద్దరికి పరిచయం ఉండటం వల్ల అప్పటి నుండే ఇద్దరూ కలిసి పనిచేయాలని అనుకునేవారు. సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే అది హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో రమేష్ రెడ్డి గారు చెప్పేస్తారట అందుకే అయనను రెబెల్ రమేష్ అని పిలుస్తారట. ఉన్నది ఉన్నట్లు చెప్పే రమేష్ రెడ్డి గారు దానివల్ల అవకాశలు కూడా వదులుకున్నారు. ఇక ఇండస్ట్రీ లో తనని తాను మార్కెటింగ్ చేసుకోకపోవడం వల్ల చాలా మందికి పలానా సినిమాకు డైలాగులు రాసింది నేనే అని తెలియదు అంటూ చెప్పారు రమేష్.

ఎన్టీఆర్ నన్ను తుత్తర్ రెడ్డి అంటాడు…
ఇక ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘రామయ్య వస్తావయ్య’ సినిమా డబ్బింగ్ అపుడు ఎన్టీఆర్ డబ్బింగ్ థియేటర్లో ఉండి నన్ను పిలిపించాడు. ఎన్టీఆర్ నన్ను తుత్తర్ రెడ్డి అంటూ ఫన్నీ గా పిలుస్తాడు. అప్పటివరకు తన మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ కి నేనే డైలాగులు రాశానని తెలియదు, అప్పుడే తెలిసి షాక్ అయ్యాడు. మీరా రాసింది నాకు ఇంతవరకు తెలియదు కొంచెం మార్కెటింగ్ చేసుకోవడం నేర్చుకోండి అంటూ సలహా ఇచ్చాడు. హరీష్ శంకర్ కూడా ఇదే విషయంలో నన్ను విమర్శిస్తాడు ఎన్నో సినిమాలకు డైలాగులు మాటలు రాసి గుర్తింపు తెచ్చుకోలేదు మార్కెటింగ్ చేసుకో అంటాడు అంటూ రమేష్ రెడ్డి చెప్పారు.

నిజానికి నన్ను నేను మార్కెటింగ్ చేసుకోక పోవడం లోపమే అని అభిప్రాయ పడ్డారు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాకు నంది అవార్డు వచ్చినా ఎవరికీ పెద్దగా ఇండస్ట్రీ లో ఈ విషయం తెలియదు అంటూ చెప్పారు. ఇక కెరీర్ లో బెస్ట్ అనిపించే సినిమా అంటే రచయిత గా ‘నవ్వులాట’ ‘భజరంగ భలి’ సినిమాలు బాగా సంతృప్తినిచ్చాయి అంటూ చెప్పారు. ఇక పోసాని గారు ఇండస్ట్రీలో మంచి మిత్రులు. సినిమాల్లో నటించడానికి కారణం హరీష్ శంకర్ అంటూ చెప్పారు. పిల్లలు ఎదుగుతున్నారు ఎన్నాళ్ళు రైటర్ గా ఉంటారు, పోనీ అందులో డిమాండ్ చేస్తారా అంటే అదీ చేయరు అలాంటప్పుడు ఇంకో పని కూడా చూసుకోవడం మంచిది అంటూ సినిమాల్లో నటించమని సలహా ఇచ్చాడు అంటూ చెప్పారు రమేష్ రెడ్డి.






























