Ramya : ప్రస్తుతం నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం బాగా వైరల్ అయింది. మూడు పెళ్లిళ్ళు చేసుకున్న నరేష్ ఇపుడు నాలుగో పెళ్లి చేసుకోబోతునట్లు వార్తలు రాగానే అందరూ షాక్ అయ్యారు. ఇక సీనియర్ నటి పవిత్ర లోకేష్ నరేష్ ల మధ్య అఫైర్ ఉందని తొందర్లో పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వచ్చినా, ఇవన్నీ కామనే పుకార్లు వస్తుంటాయి అనే లోపే కన్నడ మీడియా స్ట్రింగ్ ఆపరేషన్ పుణ్యమా అని పవిత్ర లోకేష్ నరేష్ తో కలిసుంటున్నట్లు, ఇద్దరం సహజీవనం చేస్తున్నట్లు చెప్పింది. ఇక కట్ చేస్తే సీన్ లోకి నరేష్ మూడో భార్య రమ్య ఎంటర్ అయింది.

రమ్య బ్యాక్ గ్రౌండ్, తన ఫ్యామిలీ…
ఇక నరేష్ భార్య రమ్య మీడియా ముందుకు వచ్చి నాకు నరేష్ తో ఇంకా డివోర్స్ అవ్వలేదని, పవిత్ర మా మధ్య చిచ్చుపెట్టిందని ఆరోపించింది. ఎటువంటి డబ్బు నరేష్ తో తీసుకోలేదని కూడా ఆరోపించింది. ఇక ఇదంతా పక్కన పెడితే అసలు ఎవరి రమ్య అనే ఆరా తీయడం మొదలు పెట్టారు అందరూ. రమ్య కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి, రమ్య తండ్రి వరుసకు సోదరులు. ఇక కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రమ్య కు వరుసకు సోదరుడు అవుతాడు.

ఎప్పుడో రమ్య కుటుంబం బెంగళూరుకు వలస వెళ్లిపోయారు. బెంగళూరులో ఫేమస్ హోటల్ మోతి మహల్ అనే హోటల్ ఉంది. ఇక రమ్య కన్నడ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నరేష్ బెదిరించి విడాకులకు ఒప్పించారాని, సంవత్సరం వెంటపడి నన్ను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకున్నారని, పెళ్ళయ్యాక తనకు ఇతర ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయని తెలిసి నీలాదిస్తే అవన్నీ రూమర్స్ పట్టించుకోవద్దు క్షమించు అంటూ చెప్పాడని ఆరోపించారు.



























