Ramya Krishna: ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీని తన అంద చందాలతో, నటనతో ఓ ఊపు ఊపిన రమ్యకృష్ణ ఇండస్ట్రీలో హీరోయిన్ గాను విలన్ పాత్రలలోనూ నటిస్తూ పెద్ద ఎత్తున క్రేజ్ సంపాదించుకున్నారు. రమ్యకృష్ణ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అలాగే వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలోనే రమ్యకృష్ణ తాజాగా నటించిన లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఈమె మాస్ క్యారెక్టర్ లో నటిస్తుందని తాజాగా విడుదలైన ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. ఇకపోతే రమ్యకృష్ణ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ అయ్యారు.
ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ నటి అనన్య పాండే వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా తాజాగా రమ్యకృష్ణ ముంబైలోని ఓ స్టూడియోలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

Ramya Krishna: ఇప్పటికీ తగ్గని అదే అందం…
ఇకపోతే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రమ్యకృష్ణ ఉల్లి పొరలాంటి చీర కట్టి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈఈ ఫోటోలు చూసిన నటిజన్లో ఈమె ఐదు పదిల వయసు ఉన్నప్పటికీ ఈమె అందం మాత్రం చెక్కుచెదరలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అప్పటికి ఇప్పటికీ శివగామి యాక్టింగ్ తన గ్లామర్ అలాగే ఉందని అభిప్రాయపడుతున్నారు.































