Ramya Raghupathi : నరేష్ పవిత్ర లోకేష్ ప్రేమాయణం సంగతి ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్. సీరియల్ లాగా సాగుతూనే ఉన్న ఈ ఇష్యూలో కొత్త ట్విస్ట్ వచ్చింది. అసలు నరేష్ ఎలాంటి వాడు అంటూ ఆయన భార్య రమ్య రఘుపతి మొదటి సారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తను ఇంకా తన భర్తతో విడాకులు తీసుకోలేదంటూ కోర్ట్ లో కేసు నడుస్తోందని తెలిపారు. అయితే ఇంతలో నరేష్ పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయని అందుకే మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇక అసలు నరేష్ తో తన పెళ్లి ఎలా జరిగిందనే అంశం గురించి చెప్పారు రమ్య రఘుపతి.

వేణు స్వామి వద్దని చెప్పాడు…
నరేష్ తో తన పెళ్లి ఎలా జరిగిందనే విషయాన్ని చెబుతూ రమ్య రఘుపతి ఆసక్తికర విషయాలను తెలిపారు. తనకు నరేష్ కు 21 ఏళ్ళ గ్యాప్ ఉందంటూ చెప్పారు. అయితే మొదట తనకు ఈ విషయం చెప్పకుండా దాచి పెట్టాడంటూ చెప్పారు. పెళ్ళికి కొద్దిగా రోజులు ఉన్న సమయంలో విషయం తెలిసిందని, అయితే అప్పుడు నిలదీస్తే సారీ చెప్పి నిన్ను వదులుకోవడం ఇష్టం లేక అలా అపద్ధం చెప్పానని కవర్ చేసాడు, ప్రేమ మత్తులో నేను వదిలేసాను అంటూ రమ్య తెలిపారు.

ఇక తన నిజమైన డేట్ అఫ్ బర్త్ నా డేట్ అఫ్ బర్త్ వేణు స్వామి దగ్గరికి తీసుకెళితే ఇద్దరూ కలిసి ఉండరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పాడట. కానీ ఆ విషయం మా ఇంట్లో తెలియనీయకుండా మా సిద్ధాంతితో జాతకం చూపిస్తామని ఒరిజినల్ ఇవ్వకుండా ఫేక్ డేట్ అఫ్ బర్త్ ఇచ్చాడు అంటూ తెలిపారు. మొదటి నుండి నా కుటుంబానికి తనతో పెళ్లి ఇష్టం లేకపోయినా నేను ఒప్పించి చేసుకున్నాను. కాని పెళ్ళయ్యాక బాబు పుట్టేవరకు హ్యాపీగానే ఉన్నాం, ఆ తరువాత నరేష్ కు అమ్మాయిలతో ఉన్న అఫైర్స్ ఒక్కొక్కటి బయటకు వచ్చాయి అంటూ తెలిపారు.






























