బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించిన రమ్యకృష్ణకి బాహుబలి తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయి. కాని రమ్యకృష్ణ తన పాత్రకి ప్రాధాన్యం ఉన్న వాటిని ఎంచుకుంటూ వస్తుంది. అదే విధంగా ఆమె తన యొక్క పారితోషికాన్ని కూడా భారీగా పెంచేసింది అని టాలీవుడ్ వర్గాల సమాచారం.

హిందీలో సూపర్ సక్సెస్ అయిన “అంధుదాన్” ఆయుస్మన్ ఖురాన్ హీరో నటించిన ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్ లో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మేర్లపాటి గాంధీ దర్శకత్వం వహించగా, శ్రేష్ఠ్ మూవీ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అంధుదాన్ సినిమాలో ఆయిష్మన్ ఖురాన్ నటనతో పాటు ఆ సినిమాలో నగిటివ్ పాత్ర చేసిన టబుకి కూడా మంచి గుర్తింపు తెచ్చింది. సినిమా విజయంలో టబు పాత్ర కీలక పాత్ర వహించింది. ఈ పాత్రలో టబు నటన హీరో రోల్ కి సమానంగా ఉంటుంది.. ఇందులో టబు నెగిటివ్ గానే కాకుండా చాలా బోల్డ్ గా కనిపించింది.

ఇంతటి ప్రాముఖ్యం ఉన్న పాత్రని తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుంది అని చిత్ర వర్గాలు ఆలోచనలో పడ్డారు. మొదట ఆ పాత్రకి టబు నే బాగుంటుంది అనుకున్నా టబు పారితోషికం భారీగా డిమాండ్ చేయడంతో ఆ తరువాత యాంకర్ అనుసూయను తీసుకుందాం అనుకున్నారు చిత్ర యూనిట్. కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఆ పాత్రకి రమ్యకృష్ణని తీసుకోవాలని నిర్ణయించారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉండగా రమ్యకృష్ణ మాత్రం ఆ పాత్రకి భారీ పారితోషికం డిమాండ్ చేస్తోందట.. శివగామి డిమాండ్ కు షాక్ అవుతున్నారట ఈ నిర్మాతలు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తాండ్ సినిమాలో రమ్య కృష్ణ మేజార్ రోల్ చేస్తోంది. నితిన్ సినిమాలో రమ్య కృష్ణ ఇటువంటి బోల్డ్ పాత్ర చేస్తుందో లేదో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here