హిందిలో సూపర్ హిట్ అయినా ఆందునాధన్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలోని లీడ్ రోల్ లో నితిన్ నటిస్తున్నాడు. అందులో భాగంగా ఈ సినిమా కు సంబంచింది పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఈ మధ్యనే రిలీజ్ అయింది. “వేంకటాద్రి ఎక్స్ ప్రెస్”, “ఎక్స్ ప్రెస్ రాజా”, “కృష్ణార్జున యుద్ధం” వంటి హిట్ సినిమాలను అందించిన మేర్లపాక గాంధీ ఈ సినిమాకు డైరెక్ట్ చేసున్నాడు. శ్రేష్ఠ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా నటనతో పాటుగా నెగెటివ్ రోల్ చేసిన టబు పాత్రకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. కరెక్టుగా చెప్పాలంటే ఈ చిత్రానికి హీరోకి సమానంగా ఉండే పాత్ర చేసింది “టబు”. ఈ పాత్ర నెగెటివ్ షేడ్స్ తో చాలా బోల్డ్ గా ఉంటుంది. ఆ పాత్రలో టబు నిజంగానే అదరగొట్టింది. అంతగా అదరగొట్టిన ఆపాత్రని ఎవరిని తీసుకోవాలి అని చిత్రయూనిట్ తర్జన భర్జనలు పడిందట. టబు తోనే చూపిద్దాం అనుకున్నారు కానీ.. టబు భారీగా రెమ్యూనరేషన్ అడగటంతో టబు బదులుగా అనసూయాను అనుకున్నారు. దీనితో అనసూయ కూడా మంచి రోల్ దక్కుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయిందట.. మరోపక్క ఆమె అభిమానులు సైతం అదిరిపోయే పాత్రలో తమ అభిమాన యాంకర్ కనిపించబోతుంది తెగ ఆనందపడ్డారు.




























