Ramya Krishna : ఒక్కప్పటి గ్లామర్ హీరోయిన్ ఇప్పటి శివగామి పేరు చెప్పక్కర్లేదు. అందరికీ ఓ నీలాంబరి , ఓ శివగామి అనగానే గుర్తొచ్చేది రమ్య కృష్ణనే. తొంబై లలో అందరు అగ్ర హీరోలతో ఆడిపాడిన రమ్యకు ‘భలే మిత్రులు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇక ‘సంకీర్తన’ వంటి సినిమాలో నటనకు మంచి గుర్తింపు వచ్చినా అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్ అయింది మాత్రం రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన ‘అల్లుడుగారు’ సినిమాతో. ఆ సినిమా విజయంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు రమ్యకృష్ణ.

స్టార్ గా ఎదగాలంటే వాళ్ళ పక్కలోకి వెళ్ళాల్సిందే…
నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో ఒక వైపు చేస్తూనే మరో వైపు గ్లామర్ పాత్రలను చేసి అన్నివర్గాల ప్రేక్షకులకు చేరువయింది. ఇక ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ ని ప్రేమించి పెళ్లాడింది రమ్య కృష్ణ. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అత్త, తల్లి పాత్రలతో మురిపించిన రమ్యకృష్ణ బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో మరోసారి ఫేమస్ అయింది. శివగామి అంటే రమ్య కృష్ణ అనేంతలా ఆమె ఆ పాత్రకు కనెక్ట్ అయింది, జనాలు కనెక్ట్ అయ్యారు.

ఇక ఈ క్రేజీ హీరోయిన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి సంచలనం రేపింది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు, ఆర్టిస్టులు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నా ఒక అగ్ర హీరోయిన్ మాట్లాడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే లైంగిక వేధింపులకు గురవ్వాల్సిందే.. అగ్ర హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్ల చేతిలో నలగాల్సిందే అంటూ కామెంట్స్ చేసింది. కొన్ని కావాలంటీ కొన్ని భరించాలి. కెరీర్ లో పైకి ఎదగాలని అనుకుంటే కొన్ని లైంగిక వేధింపులకు గురవ్వక తప్పదు, ఇండస్ట్రీలో నిలబడాలంటే కొన్ని త్యాగాలను చేయక తప్పదు, అవి ఎలాంటి త్యాగాలు అన్నది మన వ్యక్తిగత విషయం అంటూ మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.



























