చెన్నైలోని కానత్తూర్ కు దగ్గరలో పోలీసుల విధుల్లో భాగంగా వాహనాల తనిఖీ చేస్తుండగా రమ్యకృష్ణ కారును తనిఖీ చేయగా.. కారులో మొత్తం 96 బీర్ బాటిల్స్, 8 లిక్కర్ సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ చేస్తున్న సమయంలో రమ్యకృష్ణ కారులోనే ఉన్నారు. లాక్ డౌన్ సందర్భంగా చెన్నైలో మద్యం దొరకకపోవడంతో మహాబలిపురం నుంచి మద్యాన్ని తరలిస్తున్న డ్రైవర్ సెల్వకుమార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే, రమ్యకృష్ణ తన కారు డ్రైవర్ సెల్వ కుమార్‌ని బెయిల్‌పై విడిపించి తీసుకు వెళ్లినట్లు సమాచారం. సినీ వర్గాల్లో ఇప్పుడు ఈ విషయం రచ్చరంభోలాగా మారింది. ఒకప్రక్క వెండితెరపై నటిస్తూనే.. మరోప్రక్క బుల్లితెరపై షోలకు సిద్ధమౌతున్న రమ్యకృష్ణ సైడ్ బిజినెస్ గా ఈమధ్య మద్యం వ్యాపారం కూడా మొదలు పెట్టిందా.? అనే గాసిప్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా వుంటే.. ప్రస్తుతం రమ్యకృష్ణ ఒక T.V సీరియల్ లో నటించడానికి సైన్ చేశారు.

కారులో మద్యం సరఫరా చేస్తూ పోలీసు కేసును ఎదుర్కొన్న శివగామి ఆ అవమాన భారంతో ఈ సీరియల్ షూటింగ్ కు సరిగ్గా హాజరవడంలేదని, అసలామె ఇంట్లోనుంచే బయటికి రావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఈమధ్య కొందరు సినీ ప్రముఖులు రమ్య ఇంటికి వెళ్ళినా ఆమె ఎవర్నీ కలవడానికి ఒప్పుకోవడం లేదని, క్రొత్తగా ఏ సినిమాలూ అంగీకరించడంలేదని తాజా సమాచారం. మొత్తానికి ఎప్పుడూ లేని విధంగా మన శివగామి బాగా అప్ సెట్ అయినట్టు తెలుస్తుంది. వీలైనంత తొందరగా రమ్య ఈ డిప్రెషన్ నుండి కోలుకుని మళ్ళీ హూషారుగా షూటింగ్ లకు హాజరవ్వాలని ఆశిద్దాం.



























