కరోనా లాక్ డౌన్ టైంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రమ్యకృష్ణ పేరు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. సినీనటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం సీసాలు లభించడంతో అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. తాజాగా మన టాలీవుడ్ శివగామి లాక్ డౌన్ వల్ల వచ్చిన ఖాళీ సమయంలో పాత కాలపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన ట్విట్టర్ ఖాతాలో సీమంతం వేడుకకి సంబంధించిన 2 ఫొటోలని షేర్ చేసింది..

సోషల్ మీడియాలో షేర్ చేసిన సీమంతం ఫోటోలను చూసి ఆమె ఫ్యాన్స్ అందరూ షాకయ్యారు. లాక్ డౌన్ లో తాను బాగా ఎంజాయ్ చేస్తున్నానని, ఒక రకంగా చెప్పాలంటే ఈ లాక్ డౌన్ అనేది తన జీవితంలో ముఖ్యమైన దశ అని.. ఇంత తీరిక సమయం తనకు గతంలో ఎప్పుడూ దొరకలేదని, ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉందని ఆనందంగా చెప్పింది. ఈ సందర్భంగా రమ్యకృష్ణ తాజాగా తన సీమంతం ఫోటోలను షేర్ చేసింది. తమ ఫ్యామిలీలోని ఇద్దరు పెద్దమ్మలు సీమంతం సందర్భంగా తనను ఆశీర్వదించారని, ప్రస్తుతం వాళ్ళిద్దరూ జీవించిలేరని ఎంతైనా ఆ ఫోటోలు తన జీవితంలో మంచి జ్ఞాపకాలని ట్యాగ్ జోడించింది. అలాగే, మరో ఫొటోను కూడా శివగామి షేర్ చేస్తూ ఆ ఫోటోలో తన సీమంతం వేడుకలో పాల్గొన్న తన తల్లి ఉందని, తన వెనుకే నిలబడి తన తల్లి ఫొటోలు తీసిందని తెలియజేసింది.

రమ్యకృష్ణ తల్లి ఇందులో కెమెరా పట్టుకుని నిలబడ్డారు. 2003లో రమ్యకృష్ణ – కృష్ణవంశీల పెళ్ళి జరిగింది. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇదిలా వుంటే.. కరోనా లాక్ డౌన్ టైంలో కూడా రమ్యకృష్ణ తన 2nd ఇన్నింగ్స్ ను బాగానే ప్లాన్ చేసుకుందని టాలీవుడ్ సమాచారం. ‘బాహుబలి’ చిత్రంలో శివగామిగా నటించిన రమ్యకృష్ణ ఈమధ్య సినిమా ఆఫర్లను ఒప్పుకోవడంలో స్పీడ్ పెంచేసింది. ప్రస్తుతం రమ్యకృష్ణ.. కృష్ణ వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’, పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ‘ఫైటర్’ చిత్రంలోనూ, అలాగే సాయి ధరమ్ తేజ్ చిత్రంలోనూ నటిస్తూ బిజీబిజీగా వుంది.



























