Ranbir Kapoor : బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్, ఆలియా వివాహ బంధం తో ఒకటి అవ్వడమే కాకుండా, అలియా ఇపుడు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. అయితే రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా భారీ ఫాంటసి యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు నాగార్జున, మౌని రాయ్ వంటి వారు నటిస్తున్నారు. సెప్టెంబర్ 9న మొదటి భాగం విడుదల ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే రణ్‌బీర్, ఆలియా, అయాన్ ముఖర్జీ ఇన్‌స్టా లైవ్ లో పాల్గొన్నారు.

ప్రెగ్నెంట్ పై బాడీ షేమింగ్ అంటూ మండిపడుతున్న నెటిజన్లు…
చిత్ర ప్రచారంలో భాగంగా రణ్‌బీర్, ఆలియా, అయాన్ ముఖర్జీ అభిమానులతో ఇన్‌స్టా లైవ్ లో ముచ్చటించారు. అయితే ఒక నెటిజెన్ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న బ్రాహ్మస్త్ర సినిమాకు ఆ రేంజ్ లో ప్రమోషన్ ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నించాడు. దీనిపై స్పందిస్తూ ఆలియా సమాధానం ఇస్తుండగా మధ్యలో రణ్‌బీర్ కలుగజేసుకొని మా సినిమాని భారీగా ప్రమోట్ చేయక పోవడానికి కారణం, ఇక్కడ ఒకరు భారీగా పెరుగుతున్నారు అంటూ ఆలియా బేబీ బంప్ వైపు చూసాడు. ఈ సమధానం కి ఆలియా షాక్ అవ్వగా జస్ట్ జోక్ చేశా అంటూ కూల్ చేసాడు.

ఈ విషయాన్ని ఆలియా లైట్ తీసుకున్నా నెటిజన్లు మాత్రం బాగా మండిపడుతున్నారు. ప్టెగ్నెంట్ పై బాడీ షేమింగ్ ఏంటి అని కామెంట్లు చేస్తున్నారు. ఇపుడు ఆలియా నీకేమైనా బార్బీ లాగా ఉండాలా..? ఆలియా కన్నా పదేళ్లు పెద్ద అయినా చిన్న పిల్లోడిలా ప్రవర్తిస్తున్నావు అని అంటున్నారు. ఇంకొంతమంది అప్పుడేమో కత్రినా గురించి హేళన చేసావు. ఇపుడు ఆలియపై అందరిముందు బాడీ షేమింగ్ చేస్తున్నావు కాస్త బుద్ది ఉండాలి అని వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.



























