Ranbir Kapoor : రణ్‌బీర్ కపూర్.. కపూర్ కుటుంబం నుంచి వచ్చి బాలీవుడ్ లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. బాలీవుడ్ లోనే కాకుండా మన టాలీవుడ్ లో కూడా రణ్‌బీర్ కు అభిమానులు వున్నారు. ఇటీవలనే రణ్‌బీర్, ఆలియా వారి ఐదేల్ల ప్రేమకు స్వస్తి పలుకుతూ ఈ సంవత్సరం ఏప్రిల్ 14 న కపూర్, దత్ కుటుంబాల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. అయితే వైవాహిక జీవితం గురించి ఇప్పటివరకు ఎలాంటి వార్తలు లేవు, కాకపోతే ఇటీవలే రణ్‌బీర్ వీటిమీద ఓపెన్ అయ్యాడు.

కొన్ని కమిట్మెంట్స్ తో ముందుకు వెళ్తున్నాం…..
ఐదేళ్లు ప్రేమించుకొని ఆలియాని పెళ్లి చేసుకున్న రణ్‌బీర్ వైవాహిక జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా పెళ్లికి ముందు మా పెళ్లి తర్వాత మా లైఫ్లో పెద్దగా మార్పులు ఏమి చోటుచేసుకోలేదు అన్నాడు రణ్‌బీర్. కాకపోతే మేము కొన్ని కమిట్మెంట్స్ పెట్టుకున్నాం. అందుకే పెళ్లి మరుసటి రోజునే మేమిద్దరం ఉద్యోగానికి బయలుదేరాం. ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ గా వున్నాం. ఈ కారణంగా మాకు వివాహమైందని ఇప్పటికీ మేము గుర్తించలేకపోతున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు.

‘మేము గత ఐదేళ్లుగా కలిసే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏమీ కొత్తగా అనిపించట్లేదు. హమ్మయ్యా.. మేము పెళ్లయితే చేసుకున్నాం అనే ఫీలింగ్ మాత్రమే వుంది అని చెప్పారు.ఇక హాలీవుడ్ సినిమాలలో నటించడం గురించి స్పందిస్తూ…ప్రస్తుతం అలాంటి ఆలోచనలు ఏమి లేవని చెప్పాడు. ఇప్పుడైతే ‘బ్రహ్మాస్త్ర’ సినిమా గురించి కలలు కంటున్నానని, దాని తర్వాత అలియా షూటింగ్లు అయిపోగానే ఒక వారం తనతో గడపాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.



























