రంగస్థలం సినిమాలోని కిస్ సీన్ కోసం నిర్మాత 10 లక్షల రూపాయలు..?

0
245

ఇప్పుడు వస్తున్న సినిమాలకు భిన్నంగా వచ్చిన సినిమా రంగస్థలం రామ్ చరణ్ తన సినీ కెరీర్లో అప్పటివరకు చేయని విభిన్నమైన చెవిటి పాత్ర తో ప్రేక్షకులందరిని కుర్చీలకు కట్టిపడేసాడు. గోదావరి జిల్లా ప్రాంతానికి సంబంధించిన రంగస్థలం అక్కడి యాస, భాష అచ్చుగుద్దినట్టు దర్శకుడు సుకుమార్ దింపేసాడు. “బార్ను విత్ గోల్డెన్ స్పూన్” అనే మాట రామ్ చరణ్ కి వర్తిస్తుంది. అయినా కూడా రామ్ చరణ్ ఓ రస్టిక్ క్యారెక్టర్ లో నటించాడు అనేకంటే జీవించాడు అని చెప్పవచ్చు.

సుకుమార్ కి రంగస్థలం లాంటి కథ తన మైండ్ లోకి రావడం ఒక ఎత్తు అయితే ఆ కథకు రామ్ చరణ్ ఒప్పుకోవడం మరో ఎత్తు. స్టొరీ విజువలైజేషన్ లో ఉన్నంత ఇంటెన్సిటీ మామూలు కథ లో కనిపించదు. అయినా కూడా రామ్ చరణ్ కథని ఒక్కసారి విజువలైజేషన్ చేసుకొని ఆ స్టొరీ ని ఒప్పుకోవడం నిజంగా అభినందించాల్సిన విషయం. స్టోరీ, డైరెక్షన్ లాంటివి కాసేపు పక్కన పెడితే విలేజ్ సెట్టింగ్ వేసిన కళా దర్శకుడి ప్రతిభ మామూలుగా లేదని చెప్పవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ అంతా సెట్టింగే అని ఎక్కడ అనిపించదు. 1985 నాటి ఇల్లు, ప్రజలు వారి జీవనశైలి ఇలాంటివి ఆర్ట్ డైరెక్టర్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

రంగస్థలంలో ప్రతి పాత్ర ఓ ఆణిముత్యం. చిట్టిబాబు అన్నయ్య ఆది పినిశెట్టి అకాల మరణం తర్వాత వచ్చిన ట్రాజెడీ సాంగ్ కూడా నిజ జీవితానికి అద్దం పట్టేలా ఉంది. సినిమాకి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ కూడా బాగుందని చెప్పవచ్చు.
అయితే సుకుమార్ రంగస్థలం షూటింగ్ విశేషాల గురించి చెబుతూ.. రామ్ చరణ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లేముందు రెండు సీన్లు రెండు రోజులు అనుకున్నారు. దాదాపు ఒకరోజు పూర్తయిపోయి రెండవ రోజు కావస్తుంది.. అప్పుడు నిర్మాత జోక్యం చేసుకుని రెండవ సీన్ ఈరోజు అసలే పూర్తికాదు.. ఒకవేళ పూర్తయితే 10 లక్షల రూపాయలు బోనస్ గా ఇస్తానన్నారు. సుకుమార్ తన రైటర్స్ తో కూర్చుని సీన్ రాసుకొని 45 నిమిషాల్లో కిస్ సీన్ షూటింగ్ పూర్తి చేశారట నిర్మాత తన మాట నిలుపుకొని 10 లక్షలు ఇస్తానంటే.. రైటర్స్ టీమ్ వినమ్రంగా వద్ధని చెప్పారంట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here