మరీ పాతకాలం విలన్ల కన్నా.. మరీ క్రొత్త జనరేషన్ విలన్ల కన్నా కాస్త మధ్యకాలంలోని సినీచరిత్రలో ప్రేక్షకుల మనసు దోచుకుని అత్యధ్భుతమైన విలనిజాన్ని పండించిన నటుడెవరయ్యా అఃటే అందరినోట టక్కున వచ్చే పేరు రావు గోపాలరావు. మరి ఈ క్రొత్త జనరేషన్ లో ఆ మహానటుని వారసుడిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్న విలక్షణ నటుడు రావు రమేష్. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న విలన్ల లిస్ట్ లో ఈయన కూడా ఉన్నాడు.

ఇదిలా ఉంటే ఈమధ్యనే రావు రమేష్ ట్విట్టర్ అకౌంట్‌లో ఊహించని విధంగా కొన్ని సంచలన ట్వీట్స్ కనిపించాయి. ఆ ట్వీట్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లోని కరోనా పరిస్థితికోసం, అలాగే ఈ మధ్య ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్తితుల గురించి కూడా సంచలన ట్వీట్స్ వచ్చాయి. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై కూడా కామెంట్స్ కనిపించాయి. అవన్నీ ఒక్కసారిగా మీడియా లో అలజడి సృష్టించాయి.

వివాదస్పదమైన అంశాలకు దూరంగా ఉండే రావు రమేష్ ఏంటి ఇలా ట్వీట్ చేశాడు అనుకున్నారు.. అయితే దీనిపై రావు రమేష్ వెంటనే స్పందించి తన వివరణ అందిస్తూ… తాను ఏ సోషల్ మీడియాలోనూ లేనని.. తన పేరును వాడుకుని ఎవరో ఇవన్నీ చేస్తున్నారని, కావాలనే తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, తన పేరు నాశనం చేయడానికే ఎవరో చేస్తున్న కుట్ర అని కోపంతో రగిలిపోతున్నాడు రావు రమేష్. సినీరంగంపై విషప్రభావం చూపపించేలా ఇలాంటి నకిలీ ఖాతాలను సృష్టించి తప్పుడు సమాచారాన్ని మీడియా ద్వారా వ్యాప్తి చేస్తున్న వారిపై పోలీసులకు కంప్లైంట్ చేస్తానని చెప్పాడు రావు రమేష్. ఈ సందర్భంగా షోషల్ మీడియా లో ట్వీట్స్ తాను చేసినవి కావని.. వాటిని ఎవరూ నమ్మవద్దని అధికారికంగా ప్రకటన విడుదల చేసాడు రావు రమేష్. త్వరలోనే వాళ్లను పట్టుకుని వాళ్ళ అంతు చూస్తానంటూ శపధం కూడా చేశాడు రావు రమేష్.????



























