సాధారణంగా కోబ్రాలు పగలు చెట్లపై నిద్రిస్తుంటాయి. రాత్రుల్లు మాత్రం అవి నిద్రపోవు. అయితే ఏపీలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించిన పాపికొండల్లో మాత్రం ఈ కోబ్రాలు రాత్రి తమ తోకపై నిల్చొని అరుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 30 అడుగుల పొడవు ఉన్న ఈ కింగ్ కోబ్రాలు అప్పుడప్పుడు గ్రామాల్లోకి వచ్చి స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నట్లు ఆ గిరిజనులు వాపోతున్నారు.

1978లో పాపికొండలు 591 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే ఉండేది.. కానీ కేంద్రం దీనిని జాతీయ పార్కుగా ప్రకటించడంతో దాని పరిధి పెరిగింది. దీంతో అక్కడ జంతువులను, చెట్లను పరిరక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో జంతువుల సంఖ్య మరింత పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. కానీ గిరిజనులకు హాని కలిగించే జంతువులు మాత్రం తక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇలా ఆ పాపికండల్లో నాలుగు బెంగాల్ టైగర్స్, 6 చిరుతలు, 30 అలుగులు, నాలుగు కింగ్ కోబ్రాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా ఇక్కడ కింగ్ కోబ్రాలు ఆ శబ్దాలు చేస్తుండటంతో ఆక్కడే నివసించే గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. అద్భుతమైన వన్యప్రపంచంలో మొత్తం 1045 రకాల జంతువులున్నట్లు గుర్తించారు అధికారులు.
ఈ అభయారణ్యం ఎంతో విలువైన వృక్ష సంపదకు నెలవుగా ఉంది. వేగిస, మద్ది, బండారు, తబిస, సోమి, తాని, బెన్నంగి, గరుగుడు, గుంపెన, బిల్లుడు, తునికి, మారేడు తదితర వృక్ష సంపద ఉంది. అయితే పాపికొండలు విహార యాత్రలకు అనువైన ప్రదేశంగా కూడా అధికారులు తీర్చిదిద్దారు. ప్రతీ సంవత్సరం అక్కడకు వేల సంఖ్యలో వచ్చి.. ఆనందంగా గడుపుతారని అధికారులు తెలుపుతున్నారు.































