అత్తారింటికి వెళ్తూ.. గాలోనే పోయిన ప్రాణం !

0
69

ప్రమాదాలు చెప్పి రావు.. ఒక కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం ఒక యువకుడి ప్రాణలు బలి తీసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌ మండలం నీలగొండి (హస్నాపూర్‌)లో కూలిపని చేస్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు సోయం మాన్కు. అయితే ఇటీవలే అతని భార్య సోయం జంగుబాయికి కాలు విరగడంతో ఆమె పుట్టింటి దగ్గరే ఉంది. ఈ నేపద్యంలో ఆమెను చూడటానికి నిర్మల్‌ జిల్లా, కడెం మండలం నచ్చెన్‌ ఎల్లాపూర్‌కు బైక్‌పై వెళ్తున్నాడు సోయం మాన్కు. అయతే తను అనుకున్నది ఒక్కటైతే విధిరాత మరోలా ఉంది. సరిగ్గా దోస్త్‌నగర్‌ రాగానే నిర్మల్‌ నుంచి మంచిర్యాల వెళ్తున్న ఒక కారు వేగంగా బైకును ఢీకొట్టింది.

దీంతో మాన్కు 20 మీటర్ల దూరం ఎగిరి.. 12 అడుగుల ఎత్తున్న చెట్టు కొమ్మపై పడ్డాడు. ఈ క్రమంలో తల, కాళ్లు, చేతులు మరియు ఛాతీకి తీవ్ర గాయాలు కావడంతో ఆటను చెట్టుపై ఉండగానే కన్నుమూసాడు. అయితే చెట్టు కొమ్మకు చొక్కా చిక్కుకోవడంతో వేలాడుతూ ఉండిపోయింది అతని మృతదేహం. విషయం తెలియగానే ఘటనాస్థలాని చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దింపి పోస్ట్ పంచనామా నిర్వహించారు. ఇక ఈ ప్రమాదంలో అటు కారు కూడా ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. దీనితో ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలైనట్టు తెలుస్తుంది.. అయితే స్తానికుల వివరాల ప్రకారం కారు రాంగ్‌రూట్‌లో వస్తుందని అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. మృతుడు సోయం మాన్కు భార్య జంగుబాయి, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.