Rashi Khanna : సినిమాల్లో కేవలం ఒక హీరోయిన్ వల్ల సినిమా హిట్ అవ్వడం ప్లాప్ అవ్వడం అనే మ్యాటర్ ఉండదు. కానీ ఒక హీరోయిన్ కి వరుస హిట్లు ఉన్నాయంటే ఆమెను గోల్డెన్ లెగ్ అంటూ ఆమెను సినిమాలో పెట్టుకోడానికి ఆసక్తి చూపుతారు దర్శక నిర్మాతలు. ఇక ఆ హీరోయిన్ చేసిన సినిమాలన్ని ఖర్మ కాలి అపజయమైతే ఇక ఆమెను ఐరన్ లెగ్ అని ముద్ర వేసి ఆమె నటన బాగున్నా కూడా ఇక ఆమెకు అవకాశలు ఇవ్వరు. ఇవన్నీ ఇండస్ట్రీ లో జరిగేవే. అసలు సినిమా హిట్ అవ్వడానికి ప్లాప్ అవ్వడానికి ఎవరో ఒకరే చిత్ర బృందలో కారణం కారు. అందరి కృషి తో ఒక సినిమా తీసినపుడు ఏ ఒక్కరినో కారణంగా చూపడం తప్పు, అందునా కమర్షియల్ సినిమాల హవా నడిచే తెలుగులో హీరోయిన్ అంటే సినిమాకు గ్లామర్ అలాంటి హీరోయిన్ ను సినిమా కు గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ అనడం ఇంతవరకు సమంజసం.

ఐరన్ లెగ్ గా రాశి ఖన్నా…
మొదటి సినిమా నుండి ఇప్పటి వరకూ ప్రతి సినిమాకు కష్ట పడుతూ సినిమాల కోసం తన బరువును కూడా అదుపులో ఉంచుకుంటూ కష్టపడుతున్నారు రాశి ఖన్నా. పాపం అదృష్టం కలిసి రాక ఈ మధ్య తాను చేస్తున్న సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. దీంతో ఇపుడు ఐరన్ లెగ్ గా రాశి ఖన్నాను అనేస్తున్నారు. హిందీ లో సైడ్ క్యారెక్టర్ తో మొదలు పెట్టిన రాశి ఖన్నా ఆ తరువాత తెలుగులో నాగ శౌర్యాతో జంటగా ‘ఊహలు గుసగుసలాడే’ అనే సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత జోరు, హైపర్, బెంగాల్ టైగర్, జై లవకుశ, ప్రతిరోజు పండగే వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల గోపీచంద్ తో కలిసి మారుతీ సినిమా ‘పక్కా కమర్షియల్’ లో నటించింది.

ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఆతరువాత ప్రెసెంట్ నాగచైతన్య థాంక్యూ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా నిరాశపరచడం తో అందరూ ఇక రాశి ఖన్నాను ఐరన్ లెగ్ అనడం మొదలు పెట్టారు. తమిళం లోనూ సినిమాలు తీస్తున్న రాశి ఖన్నా అక్కడ బాగానే హిట్లు కొడుతోంది. అటు హిందీ వెబ్ సిరీస్ ల ద్వారా అక్కడి జనానికి కనిపించాలని అనుకుంటున్నా రాశి ఎంత కష్టపడినా తెలుగులో మాత్రం పెద్ద హీరోయిన్ కాలేకపోతోంది. వచ్చిన అవకాశాలన్ని ఇలా ప్లాప్ లను తెస్తోంటే రాశి ఖన్నా స్టార్ హీరోయిన్ అయ్యేదేప్పుడో.



























