Rashi khanna clarity on negative trolls: ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల లో రాశిఖన్నా ఒకరు. రాశిఖన్నా తెలుగు తమిళ్ మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా నటించారు.ఇటీవలే రాశిఖన్నా కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి చెప్పి అందరిని షాక్ కు గురించేసింది.ప్రస్తుతం రాశిఖన్నా తెలుగులో నాగచైతన్య సరసన థాంక్యూ సినిమాలో నటిస్తోంది. ఇంకోవైపు గోపీచంద్ కు జోడిగా పక్క కమర్షియల్ సినిమా చేస్తోంది. గోపీచంద్ తో రాశిఖన్నా ఇదివరకే జిల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే.

తప్పుడు ప్రచారం పై సీరియస్ అయిన రాశిఖన్నా..
తాజాగా రాశిఖన్నా సౌత్ సినిమాల పై తప్పుడు వ్యాఖ్యలు చేసిందటు సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.ఈ వార్తలపై స్పందించిన రాశిఖన్నా సీరియస్ గా ఒక వార్నింగ్ నోట్ ను పంచుకుంది. తన పై వచ్చిన తప్పుడు ప్రచారాలపై సీరియస్ గా స్పందించింది.దయచేసి ఇక పై ఇలాంటివి మానుకోండి అంటూ నోట్ రాసి మారి వార్నింగ్ ఇచ్చింది.
రాశీఖన్నా చెబుతూ, దక్షిణాది సినిమాలకు సంబంధించి నా గురించి కొన్ని కల్పిత తప్పుడు కంటెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ఎవరు చేస్తున్నారో దయజేసి ఇంతటితో ఆపేయండి. నేను అన్ని భాషల పట్ల, సినిమాల పట్ల గౌరవంతో ఉన్నాను. అంతే గౌరవంతో పనిచేస్తున్నాను. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఆపేయండి అంటూ ఓ వార్నింగ్ నోట్‌ని పంచుకుంది.తాను అన్ని భాషలు, సినిమాలను గౌరవిస్తానని రాశి ఖన్నా చెప్పారు. ఈ నోట్ ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అయింది.



























