Rashi Khanna : వర్ధమాన హీరోయిన్ గా తెలుగు తెరపై తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రాశి ఖన్నా ఆ మధ్యలో కొంత జోరు తగ్గించినా మళ్ళీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. గోపీచంద్ తో కలిసి పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తోంది. మే 8వ తేదీన మాతృదినోత్సవం సందర్బంగా తన తల్లికి మర్చిపోలేని బహుమతిని ఇచ్చింది రాశి.

అమ్మ అంటే అందరికి అపురూపమే. మనకు బాధేసినా, కోపమొచ్చినా, కన్నీళ్లొచ్చినా అమ్మ వళ్ళో తలపెట్టుకోవాలని అనుకుంటాము. సాధారణ జనమైనా సెలబ్రిటీలైనా తల్లి ప్రేమ మాత్రం ఒక్కటే. ఎలాంటి సమస్య అయినా సరే మన అమ్మే మనకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి. ఆ సమస్య తీర్చకపోయినా ఆ సమస్య ఎదుర్కొనే ధైర్యం మాత్రం అమ్మే. అలాంటి అమ్మకు మాతృదినోత్సవం నాడు అందరు శుభాకాంక్షలు చెప్తారు. ఇక సెలబ్రిటీలు ఇందుకు మినహాయింపు కాదు. సోషల్. మీడియాలో వేదికగా తమ మాతృమూర్తి పై ఉన్న ప్రేమను చాలా మంది సెలబ్రిటీలు పంచుకున్నారు.
ఇక రాశి ఖన్నా కూడా తన తల్లికి మదర్స్ డే రోజు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. ఎప్పటికైనా కాస్ట్లీ కారును సొంతం చేసుకోవాలన్న తన తల్లి కోరికను రాశి నెరవేర్చింది. ఖరీదైన బీఎమ్ డబ్ల్యూ కారును కొనిచ్చింది. 1.40 కోట్ల విలువైన బీఎమ్డబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక రాశీ ఖన్నా యోధ సినిమాతో త్వరలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది . సిద్దార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన యోధ ఈ ఏడాది నవంబర్ 11న విడుదల కానుంది. ఫర్జి అనే వినూత్న ప్రాజెక్ట్‌తో త్వరలోనే ఓటీటీలోనూ ఎంట్రీ ఇవ్వనుందీ రాశి . ఇక జూలై 1న పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తోంది.



























