టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా ఇక సినిమాలు మానేసి సీరియల్స్ చేస్తుందా అంటే అవుననే అంటున్నారు.. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందరిని కవ్వించిన ఈ బొద్దు గుమ్మ కి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకున్నారు.. అనుకున్నట్లుగానే ఆమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి..జీరో సైజు వెంటపడుతున్న అభిమానులను తన బొద్దు అందాలతో తన వెంట తిప్పుకుని వారిని తన ఫ్యాన్స్ గా మార్చుకుంది..
రాశిఖన్నా లా బొద్దుగా ఉన్న అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీ లో చాలా తక్కువగా ఉన్నా ఒకప్పుడు ఇలాంటి అమ్మాయిలకే అవకాశాలు ఎక్కువ.. పాతతరం హీరోయిన్ లను గమనిస్తే రాశి లాంటి హీరోయిన్ లే ఎక్కువ గా కనిపిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆమె కు సినిమా ఛాన్స్ లు కూడా వచ్చాయి.. తొలి సినిమాలో అందం పరంగానే కాదు రాశీఖన్నాకు అభినయం పరంగా కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. తర్వాత పలు సినిమాలు చేసినా తొలిప్రేమ సినిమా ఆమెకు పెద్ద బ్రేక్ ని ఇచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయని అన్నారు..
ఇకపోతే ప్రస్తుతం రాశీఖన్నా, హీరో గోపీచంద్ హీరోగా నటిస్తోన్న పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశీఖన్నా సీరియల్‌స్టార్‌గా కనిపిస్తుందని సమాచారం. ఇది వరకు మారుతి తన చిత్రం ప్రతిరోజూ పండగే చిత్రంలో రాశీఖన్నాను టిక్‌టాక్ స్టార్‌గా చూపించాడు. అదే స్టైల్లో ఈసారి రాశీఖన్నా సీరియల్ స్టార్‌గా చూపించబోతున్నాడట మారుతి.ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ పిక్స్‌తో రెచ్చిపోతూ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది మరి.



























