Rashmi Gautam: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ రష్మి గౌతమ్ ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా పలు సినిమాలలో కూడా నటిస్తూ సినిమాల పరంగా కూడా బిజీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడిపే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

రష్మీ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కొన్నిసార్లు పలు విమర్శలకు కూడా కారణం అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఈమె వాడు రేపిస్ట్ చాలా క్రూరంగా ఉన్నారు కాపాడండి అంటూ ఒక ఆందోళన కరమైన పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. అసలు రష్మీ ఇలాంటి పోస్ట్ చేయడానికి కారణం ఏంటి అని విషయానికి వస్తే…
రష్మీ పెట్ లవర్ అనే విషయం మనకు తెలిసిందే. ఎక్కడైనా మూగ జీవాలను హింసిస్తే వెంటనే రష్మీ రెస్పాండ్ అవుతూ వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తి కుక్కపిల్ల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి వీడియో ఈమె కంటపడింది దీంతో సోషల్ మీడియా వేదికగా రష్మీ స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Rashmi Gautam: లైంగికంగా వేధించేవాడు…
ఆ కుక్క పిల్లను కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంది. ఢిల్లీ పోలీసులు, పెటా సంస్థ, ఎంపీ మేనకా సంజయ్ గాంధీలను సదరు ట్వీట్ లో ట్యాగ్ చేసింది. అతడు చాలా క్రూయల్ గా ఉన్నాడు. అతని వలన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ప్రమాదమే. పిల్లలను లైంగికంగా వేధించేవాడు, రేపిస్ట్ కూడా కావచ్చు. అంటూ తీవ్ర పదజాలంతో ఆవేదన వ్యక్తం చేస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు రష్మికి మద్దతు తెలుపగా.. మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు.
Omg omg I can see another shitzu inside omg @DelhiPolice @Manekagandhibjp @pfaindia @peta pls help take the dogs away and make that man rot imagine what he must be doing to his family members I’m sure he is a child molester and a rapist too
Such people have no empathy https://t.co/olcq2V3G9F— rashmi gautam (@rashmigautam27) July 10, 2023






























