తెలుగు టీవీ తెరపై రష్మీ అంటే తెలియని ఉండరు. తన అందంతో బుల్లి తెరక్షకులను కట్టి పడేసే యాంకర్ రష్మీ… ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేయడం ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది యాంకర్ రశ్మి గౌతమ్.

ఒక పక్క టీవీ షోలు మరోపక్క అవకాశాల మేరకు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది రష్మీ. వచ్చిన సినిమాల్లో తన అందాలతో కనువిందు చేస్తూ కుర్రకారు గుండెల్లో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకుంది. “గుంటూరు టాకీస్” చిత్రం అనుకున్న దానికంటే అద్భుత విజయం సాధించింది అంటే అది కేవలం రష్మీ వల్లనే అనడం… అతిశయోక్తి కాదు.

అదంతా ఆలా ఉంటే సామాజిక అంశాలలో కూడా రష్మీ తనదైన శైలిలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు అనేక విషయాలలో రష్మీ తన భావాలను ట్విట్టర్ వేదిక ద్వారా తెలుపుతూ ఉంటుంది. అలానే మొన్నా మధ్యనే మూగజీవాల సంరక్షణ విషయంలో ఒక ట్విట్టర్ లో పోస్టులు చేస్తూ తనలో ఉన్న సామజిక స్పృహని తెలియచేస్తుంది. యాంకర్ గా, హీరోయిన్ గా, బిజీ బిజీగా ఉండే రష్మీ తాజగా తన స్నేహితులతో కలిసి కారులో ఆడుతూ.. పడుతూ.. రచ్చ రచ్చ చేసింది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో తన స్నేహితులతో కలిసి యాంకర్ రష్మీ కదిలే కారులో డాన్స్ చేస్తుంది.
ఈ వీడియో మీకోసం.



























