రష్మిక ఏమి చేస్తుందా అని చుస్తే… మూల కూర్చొని కుక్కబిస్కెట్లు తింటుంది… – హీరో నితిన్ !!

0
255

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఇపుడు బాగా ఫేమస్ అవ్తున్న హీరోయిన్ రష్మిక మందన్నా. ఈ భామ తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి ముందుగా ఒక కన్నడ మూవీలో నటించింది.. రాష్మిక కర్ణాటక లో 1996వ సంవత్సరంలో జన్మించింది.. ఆమె ప్రాధమిక విద్యాభ్యాసం అంతా కూడా తను పుట్టిన ఊరిలోనే పూర్తిచేసింది.. బ్యాచులర్ డిగ్రీ మాత్రం మైసూర్ లో పూర్తి చేసింది. అంతే కాకుండా రష్మిక సైకాలజీ కూడా చేసింది.. ఆ సమయంలోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది.. ఒక బ్యూటీ ప్రొడక్ట్ కి సంబందించిన యాడ్ లో నటించిన రష్మిక నీ చూసి కన్నడ డైరెక్టర్ ఆమెకు సినిమా లో నటించే అవకాశం ఇచ్చారు. కన్నడలో మొదటి సినిమా తోనే రస్మిక కు మంచి స్టార్ డమ్ వచ్చింది. దానితో వరస అవకాశాలతో ఫుల్ బిజీ అయిపోయింది ఈ అమ్మడు.. కన్నడ లో మూవీ చేస్తున్న సమయంలోనే తెలుగులో “చలో” సినిమాలో నటించే అవకాశం రావడం తో తెలుగులో సినిమా చేయడానికి ఒప్పుకుంది రష్మిక.. అలా “చలో” సినిమా తో తెలుగులో నటించడం మొదలు పెట్టిన ఈ భామ ఇపుడు వరస విజయాలతో దూసుకుపోతుంది.

గీత గోవిందం మూవీతో కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరిగేతించిన ఈ ముద్దుగుమ్మ ఇపుడు “సరిలెరు నీకేవ్వరు” తో మరొక విజయాన్ని సొంతం చేసుకుంది..అది కాకుండా ఇపుడు మళ్లీ నితిన్ సరసన భీష్మ మూవీ లో కూడా నటించింది. భీష్మ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో రష్మిక గురించి సెక్రే ట్ సిల్లీ మూవ్మెంట్ ఏమైనా ఉందా అని యాంకర్ అడిగిన దానికి హీరో నితిన్ ఇలా చెప్పుకొచ్చాడు… రాశ్మిక ఈవెనింగ్ స్నాక్స్ టైమ్ లో కుక్క బిస్కట్ లు తింటుందని అని చెప్పాడు.. దానికి వివరంగా రష్మిక తనకు ఒక బుజ్జి కుక్కపిల్ల వుందని అది అంటే తనకి చాలా ఇష్టం అని మరియు ఆమెకు కొంత క్యూరీసిటీ ఎక్కువ అని పెడిగ్రీ బిస్కట్లు ఎలా ఉంటాయో టేస్ట్ చేయాలని అనిపించింది అందుకే తిన్నాను అని క్లారిటీ ఇచ్చింది… సహజంగానే రష్మిక చాలా అల్లరి అమ్మాయి అని, సెట్ లో అందరినీ ఆటపట్టిస్తూ ఉంటుందని తనతో నటించిన వారు చెప్తుంటారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here