Connect with us

Featured

టాటా గ్రూప్స్ సంపాదనలో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్చంద సేవాసంస్థలకే ఇస్తున్నారని మీకు తెలుసా??

Published

on

“టాటా” ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినపడుతుంది. ఆరు లక్షల కోట్ల రూపాయిల విలువతో, సుమారుగా ఏడు లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా టాటా కంపినీ నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా. దేశంలోనే అతిపెద్ద కంపెనీలు అయినటువంటి రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాగ్ ఈ మూడు కలిపినా కూడా వీటికంటే టాటా గ్రూపే పెద్దది.

కానీ అంత పెద్ద కంపెనీ అయినా సరే, ఏనాడూ అత్యంత ధనవంతుల జాబితాలో టాటాలు ఎందుకు లేరో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే సుమారుగా నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి, దాన్ని నడిపించిన రతన్ టాటా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

టాటా కంపెనీ మొదట ఒక కాటన్ మిల్లుగా ప్రారంభమైంది. జంషెడ్ జి టాటా అనే అయన దీనిని స్థాపించారు. ఆలా 1868 లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది.

అసలు మన దేశంలో మొట్ట మొదటి సరిగా ఎయిర్ లైన్స్ కంపినీ మొదలు పెట్టింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియా గా చెప్పుకుంటున్న ఎయిర్ లైన్స్ మొదట్లో టాటా ఎయిర్ లైన్స్ గా ఉండేది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది ఒక్కటే కాదు ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, అలాగే మన దేశంలోనే మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ ని స్టార్ట్ చేసింది కూడా టాటాలే. ఇలా మన దేశానికీ టాటాలు ఎన్నో కొత్త కొత్త బిజినెస్ లు పరిచయం చేసారు.

వెళ్లందరిలోను మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రతన్ టాటా గురించి, రతన్ టాటా డిసెంబర్ 28 1938 వ సంవత్సరంలో దేశంలోనే ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకు పదేళ్ల వయస్సులో తల్లిదండ్రులిద్దరు విడిపోవడంతో వాళ్ళ నాయనమ్మ దగ్గర పెరిగారు రతన్ టాటా. తరువాత అమెరికాలోని కర్నెల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తీ చేసారు. వెంటనే ఐబిఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జెఆర్డీ టాటా, రతన్ టాటా ని ఇండియాకు వచ్చి టాటా స్టిల్స్ లో చేరమని సలహా ఇవ్వడంతో అమెరికానుండి అయన ఇండియా వచ్చి జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్ లో అప్రెంటీస్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

కొన్ని సంవత్సరాలు పని చేసిన తరువాత 1991 లో జేఆర్డీ టాటా, రతన్ టాటాను టాటా గ్రూప్ చైర్మన్ గా నియమించారు. అప్పట్లో చాలామంది బోర్డు అఫ్ మెంబెర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయిల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వారి అందరికి అభిప్రాయాలూ తప్పని నిరూపించారు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. పదివేల కోట్లరూపాయిలుగా ఉన్న వ్యాపారాన్ని ఆరు లక్షల కోట్లకు చేర్చాడు రతన్ టాటా.

మరి ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్నప్పటికీ కూడా రతన్ టాటా భారత దేశంలో కానీ, ప్రపంచ ధనవంతుల జాబితాలో ఏనాడూ కనిపించలేదు. ఎందుకో తెలుసా ?? టాటా కంపెనీకి వచ్చే లాభాలలో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్చంద సేవాసంస్థలకే వెళ్ళిపోతుంది. టాటా గ్రూప్ విలువ ఆరు లక్షల కోట్ల రూపాయిల కన్నా ఎక్కువే అయినప్పటికీ రతన్ టాటా ఆస్తి కేవలం ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయిలు మాత్రమే. ఒక వేళ ఈ ఆస్తి అంతా సేవాసంస్థలుకు కాకుండా రతన్ టాటాకు చెందినట్టయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి ముగ్గురిలో రతన్ టాటా తప్పకుండా ఉండేవారు.

TATA Indica Car Launch

రతన్ టాటా అయన వ్యాపార ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. 1998 లో రతన్ టాటా, టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయ్యాయి. అందరు టాటా ఇండికాను అమ్మేయాలని సలహా ఇచ్చారు. దానికి రతన్ టాటా కుడా ఒప్పుకుని ఇండికా కార్లను అమ్మడం కోసం అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి టాటా మరియు అయన టీమ్ వెళ్లారు. అయితే ఆ మీటింగ్ లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాతో మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసారు అని రతన్ టాటాను మరియు అయన టీంను అవమానపరిచారు. దానితో రతన్ టాటా ఆ డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబైకి వచ్చేసారు.

కొన్ని సంవత్సరాల తరువాత టాటా ఇండికా నష్టాలనుండి లాభాల బాట పట్టింది. అదేసమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లక్సరీ కారులైనటువంటి జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఆసమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి ఆ రెండు కంపెనీలను తాను కొంటానని ఆఫర్ చేసారు. ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుండి ముంబైకి చేరుకొని రతన్ టాటాను కలుసుకుంది. ఆలా నష్టాల్లో ఉన్న జాగ్వార్, ల్యాండ్ రోవర్ లను తొమిదివేల మూడువందల కోట్ల రూపాయలకు టేక్ ఓవర్ చేసి ఆ రెండింటిని మళ్ళి లాభాల బాట పట్టించారు.

ఈ విధంగా ఎవరైతే తనను అవమానించి తక్కువగా చూసారో వాళ్లనే తన దగ్గరకి వచ్చేలా చేసుకున్నారు రతన్ టాటా. ఇది ఒక్కటే కాదు యూరప్ కి చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేసారు. అలాగే ఇంగ్లాండ్ కి చెందిన టెట్లీ టీ అనే కంపెనీని కొని, టాటా టీ కంపెనీలో కలపడంతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టీ కంపెనీగా టాటా టీ ఎదిగింది. ఒకప్పుడు ఏ బ్రిటీష్ వాళ్ళు అయితే మన భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటీష్ వాళ్లకు తనకింద ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇవే కాదు ఇతర దేశాలకు చెందిన 22కి పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్ లో కలుపుకుని టాటాని ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ గా మార్చారు రతన్ టాటా.

టాటాలు ఎప్పుడు ఇండియాను ఒక ఎకనామిక్ సూపర్ పవర్ గా ఎదగాలని కోరుకోలేదు. భారతదేశం ఆనందకరమైన దేశంగా ఎదగాలని కోరుకున్నారు. అందుకే వారు పేద, మధ్య తరగతి వారికోసం ఎక్కువగా కృషి చేసారు. అందుకు ఉదాహరణే టాటా నానో. ఒకసారి రతన్ టాటా కార్ లో ప్రయాణిస్తుండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక భర్త, భార్య, ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. అంతే వెంటనే అయన పేద, మధ్య తరగతి వారికీ అందుబాటులో ఉండేలా లక్ష రూపాయలలో ఒక కారుని తయారు చేయాలనీ అనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతోమంది నవ్వుకున్నారు. లక్ష రూపాయలలో కారుని ఎలా తయారు చేస్తారని భయపెట్టారు. కొంతమంది వెటకారం చేసారు. కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజినీర్లను పిలిపించారు కానీ వారు కూడా లక్ష రూపాయలలో కారు తయారు చేయడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా వినలేదు. ధైర్యంగా ముందడుగు చేసారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు విడుదలైంది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వాళ్ళ నానో కార్ కొద్దిగా విఫలమైంది. నానో కారు తయారు చేయడం వల్ల వేల కోట్లలో నష్టాలు వచ్చినప్పటికి రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలలు కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కల నిజం చేయాలనేది అయన కల.

Advertisement
Nano Car Launch

రతన్ టాట్ వ్యాపార వేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్ లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయాక అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం ప్లాంటుని పశ్చిమ బెంగాల్ నుండి గుజరాత్ తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే 2008 లో టాటా గ్రూప్ కి చెందిన తాజ్ హోటల్ పైన ఉగ్రవాదుల దాడి జరపడం. ఇలా ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు.

మనకి తెలియని మరొక విషయం ఏమిటంటే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. కారణం అయన అమెరికాలో ఉన్నపుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తయిన తరువాత టాటా అమెరికానుండి ఇండియాకు రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియా కు రావడానికి సిద్దపడింది. కానీ అదే సమయంలో ఇండియాకి, చైనాకి మధ్య యుద్ధం జరుగుతుండటంతో ఆ అమ్మాయి భయపడి ఇండియాకి రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇక ఆ తరువాత అయన పెళ్లి గురించి ఆలోచించలేదట. సుమారుగా 82ఏళ్ల వయసు వచ్చినా ఆయనలో చురుకుతనం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కూడా గంటకు రెండువేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫాల్కన్ విమానాలను, హెలికాఫ్టర్లు, సూపర్ ఫాస్ట్ కార్లను నడపడం ఈయనకు హాబీ.

రతన్ తాటాకు యువత మీద వాళ్ళ శక్తి మీద మంచి నమ్మకం ఉంది. అందుకే అయన స్నాప్ డీల్, పేటియం, కార్ దేఖో, ఓలా ఇలాంటి ముప్పైకి పైగా స్టార్తప్స్ లో పెట్టుబడులు పెట్టి యువతను ప్రోత్సహిస్తున్నారు. సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణ, వారసత్వం ఇలా ఉంటుంది. కానీ టాటా అలా కాదు. టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తన కుటుంబం కోసమో, వ్యక్తిగత ఆస్తులను కూడగట్టడం కోసమో వ్యాపారం చేయలేదు. కంపెనీకి వచ్చిన లాభాలలో 66 శాతం సమాజసేవకి ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూపు ఒక్కటే. టాటాలు సంపాదిస్తున్న దానిలో చాలా వరకు సమాజానికే వెచ్చిస్తున్నారు. అందుకే భారతీయులలో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్ గా స్థిరపడిపోయింది.

నిజాయితీ, నైతిక విలువలు అనేవి టాటా గ్రూపు డి.ఎన్.ఏ లోనే ఉన్నాయి. అందుకు తాజ్ హోటల్ లో ఉగ్రవాదుల దాడి జరిగినపుడు అక్కడి ఉద్యోగులు చూపించిన తెగువే దానికి నిదర్శనం. అంత భయంకరమైన పరిస్థితులలో కూడా ఏ ఉద్యోగి కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా, తమ హోటల్ లోని సుమారుగా పదిహేను వందలకు పైగా అతిధులను కాపాడారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏంటో మంది హోటల్ ఉద్యోగులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. ఆ ఒక్క సంఘటనతో టాటా గ్రూపు విలువలకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో ప్రపంచానికి అర్ధమైంది. అలాగే టాటా ట్రస్ట్, దేశంలోని మారుమూల ప్రాంతాలలోని పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, వైద్యాన్ని అందించేదిశగా పనిచేసింది. ఇప్పటికీ మనదేశంతో పాటు ఇతర దేశాలలో చదువుకుంటున్న ఏంతో మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ లు అందుతున్నాయి.

అంతే కాదు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి మూడు వందల కోట్లకు పైగా విరాళం అందించారు రతన్ టాటా. అందుకు గాను హార్వర్డ్ యానివర్సిటీ తమ క్యాంపస్ లోని ఒక భవనానికి “టాటా హాల్” అని పేరు పెట్టింది.

అంత వరకు ఎందుకు రెండు సంవత్సరాల క్రితం దీపావళి పండుగ కానుకగా క్యాన్సర్ భాదితులకు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయిలు దానం చేసారు రతన్ టాటా. ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత్ ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురసత్కారాలతో సత్కరించింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్ తో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శ ప్రాయుడైన రతన్ టాటా మన దేశానికీ చెందిన వ్యక్తి కావడం మనం గర్వించ దగిన విషయం. ఒకప్పుడు వ్యాపారం చేయడానికి పనికిరాడు అన్నారు. కానీ ఇప్పుడు పదివేల కోట్ల రూపాయిల విలువైన సంస్థని అయన నాయకతవంలో ఆరు లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు రతన్ టాటా. ఇప్పుడు టాటా అడుగుపెట్టని రంగం అంటూ లేదు.

టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా కెమికల్స్, టాటా టెలి సర్వీసెస్, టాటా హోటల్స్, టాటా పవర్, టాటా ఎలెక్ట్రానిక్స్, టాటా ఇన్సూరెన్స్, ఇలా ఏకంగా 96కి పైగా వ్యాపారాలను నడుపుతుంది సంస్థ. ఇంత పెద్ద పారిశ్రామికి వేత్త అయినప్పటికి అయన లైఫ్ స్టయిల్ చాలా సింపుల్ గా ఉంటుంది. మీడియాకి, మీటింగులకు దూరంగా ఉంటారు. ఒక బిజినెస్ మాన్ కి ఉండవలసిన కనీస గర్వం కూడా లేని వ్యక్తి రతన్ టాటా. వీటన్నిటికీ మించి తరతరాలకు టాటా అంటే విలువలను పాటించే ఒక బ్రాండ్ ఇప్పటికీ ప్రజల మనసులో నిలపడంలో 100 శాతం విజయం సాధించారు రతన్ టాటా. అయితే అయన 2017 లో ఎన్. చంద్రశేఖరన్ ను టాటా గ్రూపు చైర్మన్ చేసి ప్రస్తుతం అయన విశ్రాంతి తీసుకుంటున్నారు.

డబ్బు పరంగా అయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు కానీ మంచితనంతో అయన అపార కుభేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులందరు ఇష్టపడే, గౌరవించే మంచి బిజినెస్ మాన్ గా “రతన్ టాటా” నిలిచిపోయారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!