Ravali : పెళ్లి సందడి సినిమాలో మా పెరటి జాంపండు అంటూ కుర్రకారుకి కిక్కిచ్చిన తెలుగమ్మాయి రవళి. శుభాకాంక్షలు, వినోదం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని అందరి టాప్ హీరోల సరసనా నటించిన రవళి సొంతూరు గుడివాడ. తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ నటించిన రవళి పెళ్లి తరువాత సినిమాలకు వీడ్కోలు చెప్పింది.

మంత్రి రోజాతో కలిసి తిరుమలలో రవళి…
2007 లో నీలి కృష్ణ అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్న రవళి ఆ తరువాత సినిమాలకు దూరమైంది. పెళ్లి తరువాత గృహిణిగా బాధ్యతలను చూసుకుంటూ ఇంటికే పరిమితంవడంతో మెయింటైన్ చేయడం మానేసి లావుగా తయారైంది రవళి. ఇటీవల రాఘవేంద్ర రావు పెళ్లి సందడి సినిమాను శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా శ్రీ లీలా హీరోయిన్ గా తీశారు.

ఆ సినిమా ఈవెంట్లో కనిపించిన రవళి నన్ను ఎవరు గుర్తుపట్టడం లేదు నేను బాగా లావుగా తయారవ్వడం వల్ల అనుకుంటా అంటూ తనపై తానే జోక్ వేసింది. అయితే ఇపుడు తిరుమలకు ఏపీ మంత్రి ఒకప్పటి హీరోయిన్ రోజా తో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబంతో కలిసి దర్శించుకుంది. ఇక ఈఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవళి ఏంటి ఇలా మారిపోయింది గుర్తుపట్టలేకపోయామంటూ కామెంట్స్ చేస్తున్నారు.



























