రామ్ చరణ్ తేజ్ ఓ వైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు సినిమాలు నిర్మిస్తూ బిజీ బిజీగా లైఫ్ గడుపుతున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా ని ప్రొడ్యూసర్ చేస్తూ , RRR సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు ఆచార్య లో ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు కూడా.. రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న రామ్ చరణ్ తేజ్ జాగ్రత్తగా ఒడ్డుకు చేరుకోవాలనే మెగా అభిమానులు కోరుకుంటున్నారు.. అయితే ఇప్పటివరకు తన తండ్రి సినిమాలే ప్రొడ్యూస్ చేస్తూ వచ్చాడు చెర్రీ.. ఖైదీ నెంబర్ 150 , సైరా ఇప్పుడు ఆచార్య సినిమాలు చేస్తూ వచ్చాడు..

ఈ నేపథ్యంలో బయట హీరోలని, తన ఫామిలీ హీరోలను కూడా తన నిర్మాణంలో నటింపచేయాలని చూస్తున్నాడట రామ్ చరణ్.. ఈ నేపథ్యం పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇకపోతే రామ్ చరణ్ రవితేజ తో ఓ మల్టీ స్టారర్ సినిమా చేయాలనీ ప్రయత్నిస్తున్నది.. విజయ్ సేతుపతి మరో హీరో గా చేయనున్నాడట.. వీరికోసం మలయాళంలో కలెక్షన్ల వర్షం కురిపించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే మూవీ రీమేక్ రైట్స్ కొన్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ సినిమాను జీన్ పాల్ లాల్ తెరకెక్కించగా.. పృథ్వీరాజ్, సురాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. లాక్ డౌన్లో సినిమా చూసిన చెర్రీ.. తెగ ఎంజాయ్ చేశాడట. ఆలస్యం చేయకుండానే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ కొనేశాడట.అప్పట్లో బాబాయ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని భావించినప్పటికీ వర్కవుట్ కాలేదట. ఈ మధ్యే ఈ సినిమాలో వీరిని తీసుకోవాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చాడట. పృథ్వీరాజ్ పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ, సురాజ్ పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఫిక్స్ చేసేశాడట. దీని గురించి ఇప్పటికే ఇద్దరితోనూ డిస్కషన్ కూడా చేశాడట.



























