Ravi Teja : మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టి ఖిలాడి తో రచ్చ చేసాడు. వరుస సినిమాలతో అభిమానులను ఖుష్ చేస్తున్నాడు. ఇక మెగాస్టార్ తో చాలా ఏళ్ల తర్వాత నటించబోతున్నాడు. ఏఏ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

రవితేజ చేయబోతున్న మొదటి పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఏఏ సినిమా పీరియాడిక్ సినిమా 1970 దశకం లో జరిగిన కథ కావడంతో సినిమాపై అంచనా పెరిగింది. ఇక ఏఏ సినిమా కు సంబందించిన ట్రైలర్ విడుదలయి మంచి టాక్ ను తెచ్చుకుంది. అంతే కాకుండా సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అది కాకుండా భారత దేశంలోనే ప్రఖ్యాత స్టూవర్టుపురం నాగేశ్వర్రావు గురించిన కథ ఏఏ సినిమా కావడం, రవితేజ కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా కూడా ఇదే అవడం విశేషం.
ఇక ఏఏ సినిమా ను వంశీ డైరెక్ట్ చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్ర లాంచింగ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని నోవాటల్ హోటల్ లో చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఏప్రిల్ 2 న ఉగాది సందర్బంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఉగాది నాడు మధ్యాహ్నం 12:06 కు ప్రీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఇక ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ కు ఇది డ్రీం డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఎన్ని విశేషాలు ఉన్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.



























