RBI Guide Lines : సోషల్ మీడియా జమానాలో ఏది నిజమో ఏది అపద్దపు వార్తో చెప్పడం కష్టమైపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి వాస్తవికతను మరచిపోయి చాలా మంది ఆ వార్త ఎక్కడినుండి వచ్చింది అని పట్టించుకోకుండా అది నిజమని నమ్మి తమ వారికి కూడా షేర్ చేస్తూంటారు. అలా మొత్తం అందరికీ ఒక ఫేక్ వార్త పాకిపోతుంది. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువైయ్యాయి. అలాంటి ఒక వార్తే మళ్ళీ ఒకటి సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ అవుతోంది.

అలాంటి నోట్లు రద్దు…
నోట్ల రద్దు అనగానే సామాన్యుడి గుండె బరువెక్కడం ఖాయం. అయితే నోట్ల రద్దు గురించి ఎలాంటి వార్త లేకపోయినా మనం నిత్యం ఏదో ఒక వస్తువు కొనుగోలుకు, అమ్మకంకు డబ్బు చలామణి చేస్తుంటాం. అలాంటి సమయంలో ఎక్కడిక్కడి నోట్లో మన చేతికి వస్తుంటాయి. అలాంటి వాటిలో చాలా వాటి మీద పేర్లు లేక ఏదో ఒక రాసిన అక్షరాలు ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలాంటి నోట్లు ఆర్బిఐ తీసుకోదు, చెల్లవు అంటూ ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎంతో మంది ఇది నిజం అనుకుని ఆందోళన చెందుతుండగా ఏకంగా ప్రెస్ బ్యూరో అఫ్ ఇండియా ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయం గురించి క్లారిటీ ఇచ్చింది.

దేశంలో అన్ని బ్యాంకులకు నిబంధలను జారీ చేసేది రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా. అన్ని బ్యాంకులు రిజర్వు బ్యాంకు అధీనంలో పనిచేస్తాయి. ఇది మనకు తెలిసిన విషయమే, అందుకే ప్రెస్ బ్యూరో అఫ్ ఇండియా అసలు రిజర్వు బ్యాంకు నోట్ల గురించి ఎలాంటి నిబంధనలను పెట్టింది అనే విషయం అందరికీ అందుబాటులో ఉంచారు. ఆర్బిఐ రూల్స్ ప్రకారం నోట్ల మీద ఎలాంటి పేర్లు రాసినా అవి చెల్లుబాటు అవుతాయి. అయితే ఆయిల్ మరకలు పడటం లేదా చిరిగిన నోట్లకు ప్లాస్టర్ వంటివి ఉంటే వాటిని బ్యాంకులో మార్పించుకోవచ్చు. కాకపోతే పేర్లు వంటివి నోట్ల మీద రాస్తే ఆ నోట్ల జీవిత కాలం తగ్గిపోతుంది అని ఆర్బిఐ హెచ్చరిస్తోంది.



























