కరోనా వైరస్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. మనదేశంలో కూడా శరవేంగా వ్యాపిస్తుంది ఈ మహమ్మారి. ఇప్పటికే 40వేలకు వరకు కరోనా బాధితుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ మే 17 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కొన్ని సడలింపులు ఇచ్చినా కూడా హైదరాబాద్ వంటి నగరాలు, పట్టణాలు రెడ్ జోన్ లో ఉండిపోవడంతో సామాన్యుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. ఈ క్రమంలో బ్యాంకు లోకులు తీసుకున్న వారికి కాస్త ఉపశమనం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూడునెలలు మారటోరియం ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల కారణంగా మరో సారి మారటోరియం పొడిగినే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.

అయితే ఇప్పటివరకు దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అదలా ఉంటె ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రయివేట్, పబ్లిక్ బ్యాంక్ చీఫ్ ఎక్సిక్యూటివ్స్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ నేపథ్యంలో మారటోరియంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే సంక్షోభంలో కూరుకుపోయిన వివిధ రంగాలకు ఊతమివ్వాలనే అంశంపై చర్చ జరిగిపినట్టు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చినా లోన్లు తీసుకున్న చాలా కంపెనీలు, వ్యక్తులు రెడ్ జోన్లలో ఉన్నారని, అందువల్ల వారియొక్క కార్యకలాపాలు మొదలవడం కష్టమని బ్యాంకులు ఆర్బీఐ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాయి. అంతేకాకుండా అర్ధిరంగంపై వత్తిడి తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు అయన కోరారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మరోసారి మారటోరియంను మూడునెలలు (90 రోజులు) పెంచే అవకాశం ఉందని అంచనాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here