సోను సూద్… ప్రస్తుతం భారతదేశంలో బాగా వినిపిస్తున్న పేరు. ఎవరైనా ఆపదలో ఉంటే నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్న రియల్ హీరో సోనుసూద్. సోను సూద్ విషయానికి వస్తే ఆయన పంజాబ్ రాష్ట్రంలోని మిగా అనే పట్టణంలో జన్మించారు.

నాగపూర్ నగరంలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో ఆయన విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆ తర్వాత ఆయన మోడలింగ్ రంగంలోకి ఎంటరయ్యారు. ఆ సమయంలో ఫ్యాషన్ షో, రాంప్ వాక్ చేసేవారు. కాపాడండి ఆయనకు సినిమాల్లో విలన్ అనే బలమైన కోరిక బలపడింది. ఆయన నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు. దింతో ఆయన 1999 లో కుళ్ళళలగర్ అనే తమిళ సినిమా ద్వారా సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో చిత్రరంగంలోకి అడుగు పెట్టాడు. ఆ తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కూడా నటించాడు. కాకపోతే ఆయనకు బాలీవుడ్ సినిమాలో నటించాలని బలమైన కోరిక ఉండేది. 2002 లో వచ్చిన షాహిద్-ఏ-ఆజం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర ద్వారా ఆయన బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. ఆపై మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ లో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. ఇక టాలీవుడ్ లో నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి మరిచిపోలేని విధంగా అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో ఆయన మంచి పేరు సాధించాడు. ఆ సినిమాకు ఉత్తమ విలన్ గా నంది పురస్కారం కూడా లభించింది.

అయితే ప్రస్తుతం భారత దేశం లో కరోనా పరిస్థితి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం వల్ల ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. అంతేకాదు ఆ సమయంలో ఎక్కడి వారు అక్కడే ఉండి పోవాల్సిన పరిస్థితి వచ్చిపడింది. దీంతో చాలామంది చేసుకోవడానికి పనులు లేక, ఊరికి వెళ్లడానికి కూడా రవాణా సదుపాయం లేక అనేకమంది ఇబ్బందులు పడ్డారు. పొట్టకూటికోసం చాలామంది వారి సొంత ఊరిని వదిలి ఎక్కడికో వెళ్లి బతికే వలస కూలీల పరిస్థితి ఐతే చాలా ఘోరంగా మారింది. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సహాయం అందించడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్న అందరికీ చేయలేకపోయాయి. ఇక ఆ సమయంలో ప్రభుత్వాలు అందజేసిన సహాయం అందుకోలేక, వారి సొంత ఊరికి వెళ్లలేక ఉన్నచోటే తినడానికి తిండి, ఉండటానికి నీడ లేక అనేకమంది వలస కూలీలు చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి సంఘటనలు చూసి చెలించిన ఓ రీల్ విలన్ రియల్ హీరో గా మారాడు. అనేకమంది నిరాశ్రయులను ఆదుకోవడానికి ఆయన బయటికి వచ్చారు. ఏ సినిమా హీరో చేయలేని విధంగా ఆయన అందరితో రియల్ హీరో అనిపించేలా పనులు చేసాడు. ఎవరో వస్తారు… ఏదో చేస్తారు అనుకుంటున్న సమయంలో సోను సూద్ దేవుడి గా మారాడు. వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు వారందరిని రైళ్లు, బస్సు, ఫ్లైట్స్ ద్వారా వారందరిని వారి సొంత ఊరికి పంపించాడు ఆయన.

ఇక 10 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఓ రైతు పడిన కష్టాలు చూసి చలించి తానున్నానంటూ విషయం తెలిసిన మూడు గంటల్లోనే ఆ రైతుకు ట్రాక్టర్ కొనిచ్చి తన మానవత్వం మరోమారు చూపించాడు. ఇక తాజాగా సాఫ్ట్ వేర్ కూరగాయల శారదకు ఉద్యోగం ఇప్పించాడు కూడా. అయితే ఇందరికి సహాయం చేస్తున్న సోనూసూద్ కు ఆస్తి దండిగా ఉంది కాబట్టే ఆయన అంతలా ఖర్చు పెడుతున్నాడని వితండ వాదాలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయితే నిజానికి సోను సూద్ కు ఎంత ఆస్థి ఉంది, ఆయన ఎలా దానిని సంపాదించాడు అన్న సంగతులు చూస్తే… ఈ విషయంపై తాజాగా ఓ సంస్థ అధ్యయనం చేయగా, సోనుసూద్ ఆస్తుల విలువ రూ. 130 కోట్లు అని తెలిపింది. సోను సూద్ గడిచిన 20 సంవత్సరాల నుండి వివిధ భాషలలో సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ వేస్తూ సంపాదించిన కష్టమే అతని ఆస్తి. బాలీవుడ్ లో అత్యధికంగా రెవెన్యూ రేషన్ తీసుకునే విలన్ లలో సోను సూద్ కూడా ఒకడు. ఇక తాజాగా ఆయన ప్రజల కోసం పది కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు అధ్యయనంలో తేలింది. ముందు ముందు కూడా ఎవరికైనా సహాయం కావాలంటే నేనున్నానంటూ సోనూసూద్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలలో ఆయన విలన్ క్యారెక్టర్ వేస్తున్న, ఆయన రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా మిగిలిపోయాడు. చాలా మంది రీల్ హీరోలను కాదు రియల్ హీరోలను అవుదాం అంటూ సోను సూద్ ను ఫాలో అయిపోతున్నారు చాలామంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here